|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ట్రంప్ సంచలనం: ఇరాన్‌తో యుద్ధం! అణ్వాయుధాల కోసం అడ్డుకుంటాం!!

Published: 02-03-2026, 8:05 PM
ట్రంప్ సంచలనం: ఇరాన్‌తో యుద్ధం! అణ్వాయుధాల కోసం అడ్డుకుంటాం!!
  • ఇరాన్‌పై దాడులు చేస్తున్నట్లు ట్రంప్ వెల్లడి
  • ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని ధ్వంసం చేస్తున్నామని ప్రకటన
  • ఇప్పటికే 10 యుద్ధ నౌకలను ధ్వంసం చేశామన్న ట్రంప్
  • ఇరాన్‌కు అణ్వాయుధాలు దక్కనివ్వబోమని హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో యుద్ధం మరికొన్ని వారాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ఇరాన్‌తో మరిన్ని వారాల యుద్ధం: ట్రంప్

ఇరాన్‌, ఇజ్రాయెల్-అమెరికా మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఇలాంటి త‌రుణంలోనే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మూడు లేదా నాలుగు వారాల యుద్ధం అనుకున్నాం.. కానీ ఇంకా ఎక్కువ సమయం పట్టొచ్చు అని ప్ర‌క‌టించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ కు అణ్వాయుధాలు దక్కనివ్వబోమ‌ని కూడా తెలిపారు.

స్పష్టమైన లక్ష్యాలతో ఇరాన్ దేశంపై దాడులు చేస్తున్నట్లు వెల్లడించారు. మొదటగా ఇరాన్ మిస్సైల్ సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నామని వివరించారు. అలాగే ఆ దేశ నేవీని నాశనం చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే 10 యుద్ధ నౌకలను ధ్వంసం చేసినట్లు కీలక ప్రకటన చేశారు ట్రంప్. ఇక ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల్లో అగ్రస్థానంలో ఉన్న ఇరాన్ కు ఎప్పటికీ కూడా అణ్వాయుధం ద‌క్క‌కుండా చేయడమే తమ మూడో లక్ష్య‌మని ట్రంప్ వెల్లడించారు.

ఇరాన్ క్షిపణి సామర్థ్యంపై దాడులు

10 యుద్ధ నౌకలను ధ్వంసం చేసినట్లు ప్రకటన

ట్రంప్ ప్రకటనతో ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. అణ్వాయుధాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలుస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.