
📌 Key Points
- ఇరాన్‌తో కాల్పుల విరమణ ప్రపంచ శాంతికి గొప్ప ముందడుగు అని ట్రంప్ అన్నారు.
- పశ్చిమ ఆసియాలో ఇది ఒక సువర్ణ అధ్యాయం కానుందని ట్రంప్ అభివర్ణించారు.
- హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం ద్వారా రవాణా సజావుగా సాగుతుందని ట్రంప్ తెలిపారు.
- ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో చైనా పాత్ర కూడా ఉందని ట్రంప్ వెల్లడించారు.
ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇది ప్రపంచ శాంతికి గొప్ప రోజని, పశ్చిమ ఆసియాలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయని ఆయన అన్నారు.
ప్రపంచ శాంతికి గొప్ప రోజు
ఇరాన్ పై రెండువారాలపాటు కాల్పుల విరమణకు ఒప్పుకోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ప్రపంచశాంతికి ఇది గొప్పరోజని మీడియా సమావేశంలో తెలిపారు. అలాగే పశ్చిమ ఆసియాలో ఇదొక సువర్ణోధ్యాయం కాబోతోందన్నారు. ఇరాన్ కు ఇక చాలు అని అనిపించిందని.. యుద్ధం పేరు ప్రస్తావించకుండా పేర్కొన్నారు. ఇక ఇరాన్ టెహ్రాన్ నిర్మాణాన్ని ప్రారంభించుకోవచ్చన్నారు. హార్ముజ్ జలసంధి రీఓపెన్ కోసం ప్రపంచదేశాలన్నీ ఎదురుచూస్తున్న క్రమంలో.. తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఆ జలసంధి మీదుగా అన్ని రవాణాలు సజావుగా జరిగేందుకు అమెరికా బలగాలు ఉంటాయన్నారు. అన్నీ సవ్యంగా జరిగేందుకు అమెరికా మద్దతు పూర్తిగా ఉంటుందన్నారు. ఇరాన్ కు మున్ముందు మంచిరోజులు ఉన్నాయని తెలిపారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం వెనుక చైనా హస్తం కూడా ఉందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని, అది నిజమేనని అనుకుంటున్నట్లుగా చెప్పారు.
పశ్చిమ ఆసియాలో సువర్ణోధ్యాయం
హార్ముజ్ జలసంధి పునఃప్రారంభం
ట్రంప్ ప్రకటనతో పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొంటుందని ఆశిద్దాం. భవిష్యత్తులో ఇరాన్ అభివృద్ధి పథంలో నడుస్తుందని భావిస్తున్నారు. ఈ పరిణామాల పట్ల ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.


