
📌 Key Points
- ఇరాన్తో యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ సమస్యలు ఎదుర్కొంటున్నాయి.
- సహకరించని మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలకు అమెరికా సహాయం చేయదని ట్రంప్ హెచ్చరించారు.
- అమెరికా వద్ద పుష్కలంగా చమురు ఉందని, కావాలంటే కొనుక్కోవచ్చని సూచించారు.
ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మిత్రదేశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు సహకరించని దేశాలకు సహాయం చేసేది లేదని తేల్చి చెప్పారు. ఇది ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
యుద్ధంతో ప్రపంచ దేశాల ఇబ్బందులు
ఇరాన్‍తో అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. చమురు, గ్యాస్ సమస్యలతో సతమతం అవుతున్నాయి. ఈ యుద్ధం ప్రభావం ఇప్పుడప్పుడే తొలిగిపోయే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ యుద్ధంలో తమకు సహకరించని మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి విరుచుకుపడ్డారు. మాకు అవసరమైనప్పుడు మీరు అండగా నిలవడం లేదు.. మీకు అవసరమైనప్పుడు అమెరికా కూడా సాయం చేయదంటూ బ్రిటన్, ఫాన్స్ పై ఫైర్ అయ్యారు. ఇరాన్ దాదాపు నాశనమైందని అత్యంత కష్టమైన పని పూర్తయిందని చెప్పారు. హర్మూజ్ మూసివేతతో ఇంధన కొరత ఎదుర్కొంటున్న తన మిత్రదేశాలకు ట్రంప్ చురకలు అంటించారు. ఇక నుంచి మీ చమురు మీరే తెచ్చుకోవాలన్నారు. జెట్ ప్రెట్రోల్ పొందలేకపోతున్న బ్రిటన్ లాంటి దేశాలకు నాదో సలహా. అమెరికా వద్ద పుష్కలంగా చమురు ఉంది. అందువల్ల మా దగ్గర కొనండి. లేదా కొంత ఆలస్యమైనా ధైర్యం కూడగట్టుకుని హార్మూజ్‍కు (Hormuz) వెళ్లి మీకు కావాల్సింది లాక్కోండి అన్నారు. ఫ్రాన్స్ మీదుగా అమెరికా విమానాలను అనుమించకపోడాన్ని ట్రంప్ ఈ సందర్భంగా తప్పుపట్టారు. సైనిక సామగ్రితో ఇజ్రాయెల్ వెళ్లే మా విమానాలకు అనుమతి ఇవ్వలేదు. ఇరాన్ అధినేతను చంపిన ఆపరేషన్ లో ఫ్రాన్స్ మాకు సహకరించలేదన్నారు.
మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం
చమురు కొనుగోలుపై సలహాలు
ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ సంబంధాల్లో కీలక మార్పులకు సంకేతంగా కనిపిస్తున్నాయి. మిత్రదేశాలు తమ విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.


