
మాస్ మహారాజ రవితేజ ఇటీవల ‘మాస్ జాతర’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయినా, ఇందులోని ‘తు మేరా లవర్’ పాట మాత్రం వైరల్ అయ్యింది. తాజాగా విడుదలైన ఈ పాట పూర్తి వీడియోలో రవితేజ ఎనర్జిటిక్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Key Points
రవితేజ 'మాస్ జాతర' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది.
'తు మేరా లవర్' పాట 'ఇడియట్' సినిమాలోని 'చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే..' రీమిక్స్.
నవంబర్ 17న 'తు మేరా లవర్' పూర్తి వీడియో సాంగ్ విడుదలైంది.
ఈ పాటలో రవితేజ తన ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు.
రవితేజకు హిట్టు పడలేదా?
మాస్ మహారాజ రవితేజ ( Ravi Teja )కు గడ్డుకాలం నడుస్తోంది. ఏ సినిమా చేసినా వైఫల్యమే ఎదురవుతోంది. తనకు మంచి హిట్టు పడి చాలాకలమే అవుతోంది. ఇటీవల ఆయన మాస్ జాతర తో ప్రేక్షకుల్ని పలకరించాడు. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. అక్టోబర్ 31న రిలీజైన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయకుండానే కనుమరుగైపోయింది.
‘తు మేరా లవర్’ పాట ప్రత్యేకతలు
వీడియో సాంగ్ రిలీజ్ అయితే ఇందులోని కొన్ని పాటలు మాత్రం బాగానే క్లిక్కయ్యాయి. అందులో ఒకటి ‘తు మేరా లవర్’ సాంగ్. ఇడియట్ సినిమాలోని ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే..’ పాటను రీమిక్స్ చేసి ఈ సాంగ్ తెరకెక్కించారు. సోమవారం (నవంబర్ 17న) తు మేరా లవర్ పాట ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ మాస్ స్టెప్పులు మీరూ చూసేయండి..
రవితేజ ఎనర్జిటిక్ డ్యాన్స్
‘తు మేరా లవర్’ సాంగ్ వీడియో విడుదల కావడంతో రవితేజ స్టైలిష్ స్టెప్పులు మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సినిమా ఫలితం ఎలా ఉన్నా, ఆయన డ్యాన్స్ నైపుణ్యం మాత్రం అద్భుతం అని ఈ పాట నిరూపించింది.


