
📌 Key Points
- విజయ్ ఆస్తుల విలువ: అక్షరాలా రూ. 404.58 కోట్లు!
- లగ్జరీ కార్లు: BMW 530, BMW i7, Toyota Lexus 350, Toyota Vellfire మోడల్స్ ఉన్నాయి.
- గత ఐదేళ్లలో విజయ్ ఆదాయం: రూ.8.04 కోట్ల నుండి రూ. 237.46 కోట్లకు!
- భార్య ఆదాయం: 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 6,13,520 ఆదాయం.
తలపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో చూపించిన ఆస్తుల వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
విజయ్ ఆస్తుల చిట్టా: ఒక్కొక్కటి షాకే!
TVK Vijay Assets : ప్రముఖ నటుడు విజయ్.. సొంతంగా పార్టీ పెట్టడమే కాక త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. ఇక విజయ్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో మార్చి 30, సోమవారం ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. దీంట్లో ఆయన రూ. 404.58 కోట్ల విలువైన ఆస్తులన్నట్లు ప్రకటించారు. అఫిడవిట్ ప్రకారం, విజయ్ మొత్తం ఆస్తుల విలువ రూ. 4,04,58,57,196గా ఉంది. దీనిలో బ్యాంక్ డిపాజిట్లు, పెట్టుబడులు, వాహనాలు, ఇతర ఆస్తుల వివరాలు సమగ్రంగా ఉన్నాయి.
ఈ అఫిడవిట్ ప్రకారం చూసుకుంటే విజయ్ వద్ద BMW 530, BMW i7, Toyota Lexus 350, Toyota Vellfire వంటి లగ్జరీ కార్లు, ఇతర వాహనాలు, బైక్ లు కూడాఉన్నాయి. విజయ్ సమర్పించిన అఫిడవిట్‌లో గత ఆర్థిక సంవత్సరాల ఆదాయ వివరాలు కూడా ఉన్నాయి. వాటి వివరాలు..
2024–25లో రూ. 184.53 కోట్లు,
లగ్జరీ కార్లు, భారీ పెట్టుబడులు: విజయ్ స్టైలే వేరు!
2023–24లో రూ. 105.69 కోట్లు,
2022–23లో రూ. 198.71 కోట్లు,
2021–22లో రూ. 237.46 కోట్లు,
గత ఐదేళ్లలో ఆదాయం: కోట్లలో లెక్కలు!
2020–21లో రూ. 8.04 కోట్లు ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు.
వీటితో పాటు విజయ్ భార్య 2020–21 ఆర్థిక సంవత్సరానికి రూ. 6,13,520 ఆదాయం పొందినట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు.
టీవీకే అధినేత విజయ్..చెన్నైలోని పెరంబూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 23న జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని, పార్టీ గుర్తు ‘విసిల్’కు ఓటు వేయాలని ప్రజలను కోరారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఓపెన్ టాప్ ప్రచార వాహనంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, డీఎంకే ఒక “దుష్ట శక్తి” అని తన ఆరోపణను మరోసారి పునరుద్ఘాటించారు.
విజయ్ ఆస్తుల వివరాలు చూస్తే దిమ్మతిరగాల్సిందే. ఎన్నికల బరిలో దూకుతున్న విజయ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


