|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన రెండు మలయాళం సినిమాలు – ఒకటి కామెడీ – మరొకటి రొమాంటిక్ థ్రిల్లర్

Published: 16-05-2025, 2:17 AM
ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన రెండు మలయాళం సినిమాలు - ఒకటి కామెడీ - మరొకటి రొమాంటిక్ థ్రిల్లర్

శుక్రవారం రెండు మలయాళ సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ‘అయ్యర్ ఇన్ అరేబియా’ కామెడీగా, ‘పరన్ను పరన్ను పరన్ను చెల్లన్’ రొమాంటిక్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించాయి. ఈ రెండు సినిమాల గురించి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Key Points

1

అయ్యర్ ఇన్ అరేబియా, పరన్ను పరన్ను పరన్ను చెల్లన్ సినిమాలు ఓటీటీలో విడుదల

2

అయ్యర్ ఇన్ అరేబియా: కుటుంబ కథతో ఎంటర్‌టైనర్

4

రెండు సినిమాలు ఒకే రోజు ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి

అయ్యర్ ఇన్ అరేబియా: కుటుంబ కథ

మ‌ల‌యాళం సినిమాలు అయ్య‌ర్ ఇన్ అరేబియా, ప‌ర‌న్ను ప‌ర‌న్ను ప‌ర‌న్ను చెల్ల‌న్ సినిమాలు శుక్ర‌వారం ఓటీటీలోకి వ‌చ్చాయి. అయ్య‌ర్ ఇన్ అరేబియా మూవీ స‌న్ నెక్స్ట్ స్ట్రీమింగ్ అవుతోండ‌గా… ప‌ర‌న్ను ప‌ర‌న్ను ప‌ర‌న్ను చెల్ల‌న్ మ‌నోర‌మా మ్యాక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

అయ్య‌ర్ ఇన్ అరేబియా మూవీలో ముఖేష్‌, ధ్యాన్ శ్రీనివాస‌న్‌, షైన్ టామ్ చాకో, ఊర్వ‌శి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. మ‌ల‌యాళం సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ఎమ్ఏ నిషాద్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. భిన్న మ‌న‌స్త‌త్వాలు క‌లిగిన ఓ ఫ్యామిలీ కథ‌తో ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్కింది.

పరన్ను పరన్ను పరన్ను చెల్లన్: ప్రేమ, కులాల మధ్య సంఘర్షణ

శ్రీనివాస అయ్య‌ర్ స‌నాత‌న భావాలు క‌లిగిన బ్రాహ్మిణ్‌. భార్య ఝాన్సీ రాణి మాత్రం ఆధునిక భావాల‌ను క‌లిగి ఉంటుంది. శ్రీనివాస అయ్య‌ర్ కొడుకు రాహుల్‌కు దుబాయ్‌లో ఉద్యోగం వ‌స్తుంది. ఇష్టం లేక‌పోయినా రాహుల్ మాట కాద‌న‌లేక కొడుకుతో క‌లిసి దుబాయ్ వెళ‌తాడు శ్రీనివాస అయ్య‌ర్‌.

తండ్రి ఆచారాలు, వ్య‌వ‌హారాల వ‌ల‌న రాహుల్ ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డాడు? మ‌రో మ‌తానికి చెందిన అమ్మాయితో రాహుల్ ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని తెలిసి శ్రీనివాస అయ్య‌ర్ ఏం చేశాడు? జారా, రాహుల్ ప్రేమ స‌క్సెస్ అయ్యిందా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌. అయ్య‌ర్ ఇన్ అరేబియా థియేట‌ర్ల‌లో పాజిటివ్ టాక్‌ ను సొంతం చేసుకున్న‌ది. క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.

రెండు సినిమాల విడుదల వివరాలు

మ‌ల‌యాళం రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ ప‌ర‌న్ను ప‌ర‌న్నుప‌ర‌న్ను చెల్లన్ శుక్ర‌వారం మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీ లో రిలీజైంది. ఈ మూవీలో సాజిన్ చెరుకాయిల్‌, ఉన్ని లాలు, స‌మృద్ధి తార కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. జిష్ణు హ‌రీంద్ర వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు . ఐఎమ్‌డీబీ లో ఈ మూవీ 8.3 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

జిజు, సంధ్య‌ప్రేమించుకుంటారు. కులాలు వారి ప్రేమ‌కు అడ్డుగోడ‌లుగా మారుతాయి. జిజు త‌క్కువ కులానికి చెందిన వాడు కావ‌డంతో సంధ్య కుటుంబ‌స‌భ్యులు ఈ ప్రేమ పెళ్లికి ఒప్పుకోరు. సంధ్య బంధువు స‌తీష్‌…జిజును కొట్టి అవ‌మానిస్తాడు. ఎలాగైనా సంధ్య‌ను లేవ‌దీసుకుపోయి పెళ్లిచేసుకోవాల‌ని జిజు ఫిక్స‌వుతాడు. జిజు ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయా? జిజు ప్లాన్ గురించి తెలిసిన స‌తీష్ ఏం చేశాడు? జిజు, సంధ్య‌ల‌ను అడ్డుకున్నాడా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

మొత్తం మీద, రెండు సినిమాలు వేర్వేరు జోనర్లలో వేర్వేరు కథలతో ప్రేక్షకులను అలరించాయి. ఓటీటీ ప్రేక్షకులకు మంచి ఎంపికగా ఈ సినిమాలు నిలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.