|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా ఇంట్లో సంబరాలు! కవలలతో ఉపాసన డిశ్చార్జ్.. వారసుడి రాకతో ఆనందంలో కుటుంబం!

Published: 05-02-2026, 7:35 AM
మెగా ఇంట్లో సంబరాలు! కవలలతో ఉపాసన డిశ్చార్జ్.. వారసుడి రాకతో ఆనందంలో కుటుంబం!
  • మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు.
  • ఉపాసన జనవరి 31న కవల పిల్లలకు జన్మనిచ్చారు.
  • ఉపాసన తన కవల పిల్లలతో అపోలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
  • మెగా ఇంట్లో వారసుడికి ఘనంగా స్వాగతం పలికినట్లు సమాచారం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఉపాసన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మెగా కుటుంబ సభ్యులు మరియు అభిమానులు వారసుడి రాకతో సంతోషంగా ఉన్నారు.

కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన

Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతుల తమ రెండవ సంతానంలో భాగంగా కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. వీరి రెండో సంతానంలో భాగంగా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి జన్మించారు. ఇలా మెగా వారసుడు రావడంతో అభిమానులు కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇకపోతే ఉపాసన(Upasana) జనవరి 31వ తేదీ కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇలా పాప పుట్టిన సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అపోలో హాస్పిటల్ వాతావరణంలో అభిమానులు పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇకపోతే తాజాగా అపోలో హాస్పిటల్ నుంచి ఉపాసన తన ఇద్దరు కవల పిల్లలతో డిశ్చార్జ్ అయ్యారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఉపాసన హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఎలాంటి హడావిడి ఆర్పాటాలు లేకుండా ఉపాసన రాంచరణ్ (Ramcharan)సైలెంట్ గా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలుస్తోంది. 2023వ సంవత్సరంలో ఉపాసన రాంచరణ్ దంపతులు తమ మొదటి సంతానంలో భాగంగా క్లీన్ కారా(Klin Kaara)కు జన్మనిచ్చారు అయితే ఆ సమయంలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు రాంచరణ్ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అలాగే పెద్ద ఎత్తున మెగా వారసురాలికి స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.

హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఉపాసన

ఇక రెండో సంతానంలో భాగంగా ఉపాసన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన విషయం కూడా బయటకు తెలియకుండా ఇంటికి వెళ్లిపోయారు.. ఇలా సైలెంట్ గా వెళ్ళిపోవడానికి కూడా కారణం లేకపోలేదని చెప్పాలి. గత మూడు రోజుల క్రితం రామ్ చరణ్ తన పెద్ద కుమార్తె క్లిన్ కారాతో కలిసి హాస్పిటల్ కు వెళ్ళగా ఒక్కసారిగా అభిమానులు చుట్టుముట్టి ఎంతో ఇబ్బందులకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో భారీగా భద్రతను ఏర్పాటు చేసుకొని ఎలాంటి హడావుడి ఆర్భాటం చేయకుండా వెళ్లారని తెలుస్తుంది. ఇక మెగా ఇంట్లో వారసుడికి ఘనస్వాగతం పలికినట్టు సమాచారం.

మెగా వారసుడి పరిచయం ఎప్పుడో?

మెగా కుటుంబంలోకి వారసుడి రాక

రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ పిల్లలను మీడియాకు పరిచయం చేయటానికి ఏమాత్రం ఇష్టపడలేదని చెప్పాలి. ఇప్పటివరకు క్లీన్ కారా ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలను కూడా తెలియ చేయలేదు ఇటీవల అపోలో హాస్పిటల్ లో క్లిన్ కారా కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోటోలను వెంటనే డిలీట్ చేయాలని వీటిని వైరల్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ మెగా టీం నుంచి వార్నింగ్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇది కేవలం వారి వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయమని చరణ్ టీం తెలియచేశారు. ఇలా మెగా వారసురాలు జన్మించి మూడు సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు పరిచయం చేయని ఉపాసన మెగా వారసుడిని ఎప్పుడు పరిచయం చేయబోతున్నారో వేచి చూడాలి.

మెగా కుటుంబంలోకి కొత్త వారసుడు రావడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. రామ్ చరణ్ మరియు ఉపాసన తమ పిల్లలతో సంతోషంగా ఇంటికి చేరుకున్నారు. వారి భవిష్యత్తుకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.