|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా ఇంట సందడి: రామ్ చరణ్, ఉపాసన కవలలకు పేర్లు ఖరారు! చిరంజీవి ఆనందం!!

Published: 13-02-2026, 4:35 AM
మెగా ఇంట సందడి: రామ్ చరణ్, ఉపాసన కవలలకు పేర్లు ఖరారు! చిరంజీవి ఆనందం!!
  • ఉపాసన, రామ్ చరణ్ దంపతులకు కవలలు (ఒక అమ్మాయి, ఒక అబ్బాయి) జననం.
  • చిరంజీవి మనవడు, మనవరాలికి శివరామ్ కొణిదెల, అన్వీర దేవి కొణిదెల అని నామకరణం.
  • శివరామ్ పేరు శివుడు, రాముడి కలయిక అని, అన్వీర దేవి అంటే అపారమైన ధైర్యం కలిగిన దేవత అని అర్థం.
  • కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా నామకరణ వేడుక జరిగింది.

రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. జనవరి 31న జన్మించిన ఈ కవలలకు శివరామ్ కొణిదెల, అన్వీర దేవి కొణిదెల అని నామకరణం చేశారు. ఈ వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.

ఉపాసన, రామ్ చరణ్ దంపతుల కవలల జననం

Upasana Ram Charan: మెగా కుటుంబంలోకి ఇటీవల బుల్లి వారసుడు, వారసురాలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే .ఉపాసన(Upasana) రాంచరణ్ (Ramcharan) దంపతులు జనవరి 31వ తేదీ పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇక ఇందులో ఒక అమ్మాయి, అబ్బాయి జన్మించటం విశేషం. జనవరి 31వ తేదీ ఈ చిన్నారులు జన్మించడంతో నేడు ఈ చిన్నారులకు ఎంతో ఘనంగా నామకరణ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిందని తెలుస్తోంది. ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడమే కాకుండా తమ చిన్నారుల పేర్లను అధికారికంగా తెలియజేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి తన మనవడు మనవరాళ్లతో కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేశారు అలాగే తమ పిల్లల పేర్లను కూడా ప్రకటించారు. మనవడికి శివరామ్ కొణిదెల(shivaram Konidela) అని పేరు పెట్టగా పాపకు అన్వీర దేవి కొణిదెల(Anveera Devi konidela) అని నామకరణం చేసినట్లు తెలియజేశారు. ఇలా చిన్నారులకు ఈ పేర్లు పెట్టడం వెనుక గల కారణం పేర్లు వెనుక ఉన్న అర్థాన్ని కూడా తెలియజేశారు. శివరామ్ అనే పేరు సాక్షాత్తు ఆ పరమశివుడు అలాగే శ్రీరాముడి కలయికగా పెట్టారు. ఇక వారసత్వంగా చూస్తే చిరంజీవి గారు అసలు పేరు శివ శంకర వరప్రసాద్. ఈ పేరు నుంచి శివ, రామ్ చరణ్ పేరు నుంచి రామ్ కలయికగా చిన్నారికి శివరామ్ అని పెట్టినట్టు తెలుస్తుంది. ఈ పేరు ఎంతో బలం, భక్తి, ధర్మానికి ప్రతీకగా నిలుస్తుంది.

మనవడు, మనవరాలికి పేర్లు పెట్టిన చిరంజీవి

ఇక చిన్నారి అన్వీర దేవి పేరు విషయానికి వస్తే అన్ అంటే అనంతమైన, వీర అంటే ధైర్యం. “అపారమైన ధైర్యం కలిగిన దేవత” అనే అర్థం కలదు. బలం మరియు సౌమ్యత రెండు ఒకే చోట ఉండాలన్న ఉద్దేశంతో ఈ పేరు చివరన దేవి జోడించారని తెలుస్తోంది. ఇలా ఈ చిన్నారుల నామకరణ మహోత్సవ వేడుక చిరంజీవి నివాసంలోనే ఎంతో సాంప్రదాయబద్ధంగా, అంగరంగ వైభవంగా జరిగింది. ఇక చిరంజీవి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ కు ఒక కుమార్తె క్లీన్ కారా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు శివరామ్, అన్వీర దేవి కూడా రావడంతో మెగా కుటుంబ సభ్యులలోను అలాగే అభిమానులలోను పండుగ వాతావరణం నెలకొంది.

పేర్ల వెనుక ఉన్న అర్థం ఏమిటి?

ఇక చిరంజీవి షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో రామ్ చరణ్ దంపతులతో పాటు చిరంజీవి దంపతులు అలాగే ఉపాసన తల్లితండ్రులు కూడా ఉన్నారు. ఇక రాంచరణ్ దంపతులకు పెళ్లయిన 11 సంవత్సరాలకు మొదటి సంతానంలో భాగంగా క్లీన్ కార (Klin Kaara)జన్మించారు. అయితే ఈ చిన్నారి జన్మించిన రెండు సంవత్సరాలకు ఉపాసన తన రెండో ప్రెగ్నెన్సీని ప్రకటించడమే కాకుండా ఈసారి ఏకంగా కవలలకు జన్మనివ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మెగా కుటుంబంలోకి కొత్తగా వచ్చిన శివరామ్, అన్వీర దేవి రాకతో ఆనందం వెల్లివిరిసింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.