|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Upasana: అత్త, కోడలు మధ్య గొడవ.. రామ్ చరణ్‌కు కంప్లైంట్ ఇచ్చిన ఉపాసన.. వైరల్‌గా మారిన పోస్ట్

Published: 24-06-2025, 4:19 AM
Upasana: అత్త, కోడలు మధ్య గొడవ.. రామ్ చరణ్‌కు కంప్లైంట్ ఇచ్చిన ఉపాసన.. వైరల్‌గా మారిన పోస్ట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్. తాజాగా, ఆమె షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె అత్త, అమ్మమ్మతో కలిసి కనిపిస్తుంది. వీడియోలోని సంఘటనలే వైరల్‌కు కారణం.

Key Points

1

ఉపాసన తన అత్తగారితో కలిసి పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించింది.

2

అత్త, కోడలు మధ్య చిన్న గొడవ జరిగిందని, దాని గురించి రామ్ చరణ్ కి ఉపాసన కంప్లైంట్ చేసిందని వార్తలు.

4

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉపాసన యొక్క వైరల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) సతీమణి ఉపాసన(Upasana) నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. భర్త కూతురితో కలిసి వెకేషన్స్‌కు వెళ్లిన ఫొటోలను షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. ఆమె సినిమాల్లో నటించనప్పటికీ స్టార్ హీరోయిన్ అంత పాపులారిటీ దక్కించుకుందనడంలో అతిశయోక్తి లేదు. అలాగే సాయం కోరిన వారి కష్టాలను తీరుస్తూ ప్రశంసలు అందుకుంటుంది. ఇక ఉపాసన తన కూతురిని చూసుకుంటూనే అపోలో హాస్పిటల్ బాధ్యతలు కూడా చూసుకుంటుంది. ఇటీవల ఆమె తన అత్తగారికి ఓ పచ్చళ్ల బిజినెస్ కూడా పెట్టించింది. దీని ద్వారా స్టార్ హీరో, హీరోయిన్లకు పలు ఐటమ్స్ పంపిస్తూ సర్‌ప్రైజ్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భర్త, అత్త, తన అమ్మమ్మ అంజనమ్మతో కలిసి ఉన్న వీడియోను షేర్ చేసింది.

అత్త, కోడలు మధ్య చిన్న గొడవ

ఇక ఇందులో మామిడికాయ పచ్చడి పెట్టి అందరికీ పంపించారు. అలాగే పెట్టిన వెంటనే, సురేఖ, అంజనమ్మ వేడి అన్నం పెట్టుకుని టేస్ట్ చూడటంతో పాటు అక్కడ పని చేస్తున్న వారందరికీ పెట్టారు. అలాగే ఆ అన్నాన్ని రామ్ చరణ్, ఉపాసన కూడా తిని సూపర్‌గా ఉందని చెప్పారు. ఇక ఈ వీడియోకు ‘‘మా ఇంటి ప్రేమ మరియు సంప్రదాయాన్ని స్వాగతిస్తూ మీ అందరికీ పంపుతున్నాము. @athammaskitchen వద్ద, మేము అసలైన తెలుగింటి ఆవకాయను అందిస్తున్నాము. ఇది ఒక వారసత్వం, ఒక జ్ఞాపకం, ఒక భావోద్వేగం. తరతరాలుగా అందించబడిన ఒక వంటకం మీ ప్లేట్‌ను మరింత అందంగా మారుస్తుంది’’ అనే క్యాప్షన్ జత చేసింది.

రామ్ చరణ్ కు ఉపాసన కంప్లైంట్

అలాగే ఇందులో ఈ కొత్త ఆవకాయ్ టేస్ట్ గురించి సురేఖ , అంజనమ్మ మాట్లాడుకున్నారు. లేదు లేదు కొద్దిగా పులుపు తగ్గించాలంటూ అత్తాకోడళ్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక ఇది పెద్ద గొడవ అన్నట్టుగా రామ్ చరణ్‌కి ఉపాసన కంప్లైంట్ చేశారు. కాగా, రామ్ చరణ్ నాయనమ్మ అంజనమ్మ అస్వస్థతకు గురైనట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కెబినెట్ సమావేశం నుంచి హుటాహుటిన హైదరబాద్‌కు వచ్చినట్లు టాక్. ఈక్రమంలోనే ఉపాసన ఈ వీడియోను షేర్ చేయడంతో ఈ వార్తల్లో నిజం లేదని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఆ వీడియో ఎప్పటిదో అయితే ఉపాసన ఇప్పుడు పెట్టిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఉపాసన పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చివరగా, ఉపాసన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో నిజంగా ఎప్పుడు చిత్రీకరించబడిందనేది తెలియదు. అయితే, ఇది ప్రజలలో చర్చకు దారితీసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.