
📌 Key Points
- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రెగ్నెన్సీలో ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్’ అవార్డు గెలిచారు.
- వ్యాపారవేత్తగా, అపోలో బాధ్యతల్లో ఉంటూనే ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఉపాసన.
- ప్రెగ్నెన్సీ కారణంగా అవార్డు వేడుకకు వెళ్లలేకపోయానని ఉపాసన సోషల్ మీడియాలో వెల్లడి.
- రామ్ చరణ్ ప్రస్తుతం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రెగ్నెన్సీ సమయంలోనూ అరుదైన ఘనత సాధించారు. ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డు గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా పంచుకోగా, నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
ఉపాసనకు అరుదైన అవార్డు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)సతీమణి ఉపాసన (upasana)వ్యాపారవేత్తగా రాణిస్తూనే.. అపోలో హాస్పిటల్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తుంది. అంతేకాకుండా తన కూతురిని చూసుకుంటుంది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయిన ఉపాసన ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటోంది. ఆమె కవల పిల్లలకు జన్మనివ్వబోతుండటంతో.. మరింత జాగ్రత్తలు తీసుకుంటుంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తోంది. అభిమానులకు దగ్గరగా ఉంటూ.. నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, ఉపాసన అరుదైన ఘనత సాధించింది. ఆమెను అవార్డు వరించింది. మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అనే అవార్డ్‌ను దక్కించుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
ప్రెగ్నెన్సీలోనూ ఆగని స్ఫూర్తి
కానీ ఆమె ప్రెగ్నెంట్‌గా ఉండటం వల్ల అవార్డు తీసుకునేందుకు వెళ్లలేకపోయానని తెలిపింది. మానసికంగా మరియు శారీరకంగా సానుకూల మార్పును తీసుకురావడంపైనే మా దృష్టి ఎల్లప్పుడూ ఉంది. ఈ గుర్తింపు ప్రతిరోజూ మరింత ఎక్కువగా చేయడానికి మా పరిమితులను అధిగమించడానికి మా అందరినీ ప్రేరేపిస్తుందని చెప్తూ అవార్డుతో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తూ.. మెగా కోడలికి కంగ్రాట్స్ చెబుతున్నారు.
రామ్ చరణ్ ‘పెద్ది’ అప్‌డేట్
కాగా.. రామ్ చరణ్ విషయానికొస్తే.. అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘పెద్ది’ సినిమాతో ఫుల్ బిజీ అయిపోయాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలోకనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది మార్చి నెలలో విడుదల కాబోతుంది.
ఉపాసన తన వ్యాపార, సామాజిక బాధ్యతలతో పాటు, గర్భవతిగా కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమె సాధించిన ఈ విజయం మహిళలకు ఆదర్శం. మెగా కోడలికి నెటిజన్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


