
📌 Key Points
- ఏప్రిల్ 2న రెడ్‌మి నోట్ 15 5G SE విడుదల, 50MP కెమెరా ప్రధాన ఆకర్షణ.
- రియల్‌మి 16 5G ఏప్రిల్ 2న విడుదల, సెల్ఫీ మిర్రర్‌తో సరికొత్త అనుభూతి.
- వివో V70 FE ఏప్రిల్ 2న విడుదల, 200MP అల్ట్రా క్లియర్ కెమెరా ప్రత్యేకత.
- వన్‌ప్లస్ నార్డ్ 6 ఏప్రిల్ 7న విడుదల, 9000mAh బ్యాటరీతో 2.5 రోజుల బ్యాటరీ లైఫ్.
ఏప్రిల్ నెలలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. రెడ్‌మి, రియల్‌మి, వివో వంటి కంపెనీలు సరికొత్త ఫీచర్లతో బడ్జెట్ మరియు మిడ్-రేంజ్ ఫోన్‌లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
రెడ్‌మి నోట్ 15 5G SE: ఏప్రిల్ 2న విడుదల కానున్న స్పెషల్ ఎడిషన్
Upcoming Smartphones in April 2026 : ఏప్రిల్ నెలలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. ఈ నెలలో బడ్జెట్ నుంచి మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనున్నాయి.
Upcoming Smartphones in April 2026 : కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? వచ్చే ఏప్రిల్ నెలలో అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ ఫోన్లు రాబోతున్నాయి. గత మూడు నెలల్లో అనే బ్రాండ్ల నుంచి ఆకట్టుకునే స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి.
చాలావరకూ కంపెనీలు ఈ నెలలో బడ్జెట్ నుంచి మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లు ఎక్కువగా రిలీజ్ చేయనున్నాయి. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ల లాంచ్ తేదీలను ప్రకటించాయి. అయితే, మరికొన్ని కంపెనీలు కొత్త ఫోన్‌లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. కానీ, ఇంకా లాంచ్ తేదీని ప్రకటించలేదు. రాబోయే అన్ని స్మార్ట్‌ఫోన్‌ల వివరాలపై ఓసారి లుక్కేయండి.
వచ్చే ఏప్రిల్‌లో ఏ స్మార్ట్ ఫోన్‌లు లాంచ్ కానున్నాయి? :
రియల్‌మి 16 5G: సెల్ఫీ మిర్రర్‌తో సరికొత్త ఫీచర్
రెడ్‌మి నోట్ 15 5జీ SE : రెడ్‌మి నోట్ 15 5జీ ఫోన్ ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు, కంపెనీ స్పెషల్ ఎడిషన్ రెడ్‌మి నోట్ 15 5జీ SEని ఏప్రిల్ 2న లాంచ్ చేయబోతోంది. లాంచ్ తేదీ ప్రకటనతో పాటు ఇందులో 50MP మెయిన్ బ్యాక్ కెమెరా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
రియల్‌మి 16 5G : రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్‌మి 16 5జీ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ చేస్తోంది. భారత మార్కెట్లో ఏప్రిల్ 2వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ లాంచ్ కానుంది. మొదటిసారిగా, ఈ ఫోన్‌లో రియర్ కెమెరా బార్‌లోనే సెల్ఫీ మిర్రర్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సరికొత్తగా సెల్ఫీలు తీసుకోవచ్చు.
వివో V70 FE : చైనా కంపెనీ వివో కూడా కొత్త స్మార్ట్‌ఫోన్ వివో V70 FEను ఏప్రిల్ 2న రిలీజ్ చేయనుంది. ఈ ఫోన్‌లో 200MP అల్ట్రా క్లియర్ మెయిన్ OIS కెమెరా ఉంటుంది.
Read Also : JioHotstar IPL 2026 : పండగ చేస్కోండి.. IPL కోసం బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. మీ నెట్‌వర్క్ ఏదైనా మ్యాచ్ మిస్ కాకుండా చూడొచ్చు..!
వివో V70 FE మరియు వన్‌ప్లస్ నార్డ్ 6: విడుదల తేదీలు, ప్రత్యేకతలు
వన్‌ప్లస్ నార్డ్ 6 : ఏప్రిల్ 7వ తేదీన సాయంత్రం 7 గంటలకు వన్‌ప్లస్ నార్డ్ 6 లాంచ్ కానుంది. ఈ ఫోన్ 9000mAh అతిపెద్ద బ్యాటరీతో వస్తుంది. కంపెనీ ప్రకారం.. ఈ ఫోన్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 2.5 రోజులు లేదా అంతకంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.
ఏఐ+ నోవా 2 5G సిరీస్ : భారతీయ కంపెనీ ఏఐ+ కూడా ఏప్రిల్ 9న ఏఐ+ నోవా 2 5G, ఏఐ+ నోవా 2 అల్ట్రా 5G అనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ఏఐ+ నోవా 2 అల్ట్రా 5G, నథింగ్ ఫోన్ మాదిరిగా పాపులర్ లైట్ డిస్‌ప్లేతో వస్తుంది.
ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా : ఒప్పో కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రాను భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు కూడా రెడీ అవుతోంది. కంపెనీ ఇంకా లాంచ్ తేదీని ప్రకటించలేదు కానీ, ఏప్రిల్ నెలాఖరులోగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో : ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రోను ఏప్రిల్‌లో లాంచ్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్లతో పాటు ఒప్పో A6, రియల్‌మీ C100 5G, మోటో G67, ఐకూ నియో 11, పోకో M8 ప్రో వంటి మరికొన్ని ఫోన్‌లు కూడా ఏప్రిల్‌లో లాంచ్ కావచ్చు.
ఏప్రిల్ నెలలో విడుదల కానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లు వినియోగదారులకు సరికొత్త ఎంపికలను అందించనున్నాయి. మీ బడ్జెట్, అవసరాలకు తగిన ఫోన్ ఎంచుకోవడానికి ఇది మంచి సమయం.


