|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇరాన్ టాప్ లీడర్ల గుట్టు చెబితే.. రూ.92 కోట్లు మీవే! సంచలన ఆఫర్ ప్రకటించిన అమెరికా!!

Published: 13-03-2026, 8:35 PM
ఇరాన్ టాప్ లీడర్ల గుట్టు చెబితే.. రూ.92 కోట్లు మీవే! సంచలన ఆఫర్ ప్రకటించిన అమెరికా!!
  • ఇరాన్ అగ్రనేతల సమాచారం ఇచ్చిన వారికి అమెరికా భారీ రివార్డు ప్రకటించింది.
  • సమాచారం ఇచ్చిన వారికి 92.5 కోట్ల రూపాయల రివార్డు లభిస్తుంది.
  • అమెరికా ప్రకటించిన జాబితాలో మొజ్తాబా ఖ‌మేనీతో సహా 9 మంది ఇరాన్ నేతలు ఉన్నారు.
  • అమెరికా సైనిక సమాచారం ఇస్తే కోటి రూపాయల రివార్డు ఇస్తామని ఇరాక్ సంస్థ ప్రకటించింది.

ఇరాన్ అగ్రనేతల గురించి సమాచారం ఇస్తే అమెరికా భారీ రివార్డును ప్రకటించింది. ఏకంగా 92 కోట్ల రూపాయలను బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అగ్రనేతల సమాచారం కోసం అమెరికా ఆఫర్

ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూడు దేశాల మధ్య దాదాపు 14 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం నేపథ్యంలో వేలాది మంది చనిపోయారు. కోట్లల్లో ఆస్తి నష్టం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇరాన్ టాప్ లీడర్ల గురించి సమాచారం ఇచ్చిన వాళ్లకు 10 మిలియన్ డాలర్ల ఆఫర్ ప్రకటించింది అమెరికా.

రివార్డుతో పాటు రక్షణ హామీ

అంటే భారత కరెన్సీలో రూ. 92.5 కోట్లు అన్నమాట. ఇరాన్ టాప్ లీడర్ల సమాచారం అందిస్తే, రివార్డు ఇవ్వడమే కాకుండా, సదరు వ్యక్తులకు రక్షణ కల్పిస్తామని హామీ కూడా ఇచ్చింది అమెరికా. ఇక‌ అమెరికా తాజాగా ప్రకటించిన లిస్టులో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖ‌మేనీ సహా మరో తొమ్మిది మంది పేర్లు ఉన్నాయి. మరోవైపు అమెరికా మిలిటరీకి సంబంధించిన సమాచారం ఇస్తే, కోటి రూపాయల రివార్డ్ ఇస్తామని ఇరాన్ మద్దతు సంస్థ ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ ప్రకటన చేసింది.

ఇరాన్ మద్దతు సంస్థ ప్రకటన

A post shared by Roya News English (@royanewsenglish)

ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రివార్డుల ప్రకటన మరింత వేడిని రాజేసింది. పరిస్థితి ఎలా మారుతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.