|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మిడిల్ ఈస్ట్ వార్: అమెరికాకు రోజుకు వేల కోట్ల నష్టం! దివాళా తీసేనా?

Published: 03-03-2026, 2:36 AM
మిడిల్ ఈస్ట్ వార్: అమెరికాకు రోజుకు వేల కోట్ల నష్టం! దివాళా తీసేనా?
  • మిడిల్ ఈస్ట్ సైనిక చర్యలకు అమెరికా రోజుకు వందల మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది.
  • యుద్ధం మొదలైన మొదటి రోజే అమెరికా 8,300 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.
  • ఒక్కో SM-3 క్షిపణి ధర 83 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది.
  • ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రక్షణకు ‘ఆపరేషన్ ప్రోస్పెరిటీ గార్డియన్’ ద్వారా భారీగా ఖర్చు చేస్తోంది.

మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది. ప్రతిరోజు వందల మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తూ, మొదటి రోజునే బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

అమెరికా రోజువారీ ఖర్చు ఎంత?

మిడిల్ ఈస్ట్ యుద్ధంలో అమెరికా తన మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు అండగా నిలవడానికి ప్రతిరోజూ అక్షరాలా వందల మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది. రక్షణ నిపుణుల అంచనా ప్రకారం. కేవలం మధ్యప్రాచ్యంలో మోహరించిన తన సొంత సైనిక బలగాలు, యుద్ధ నౌకలు (Aircraft Carriers), అత్యాధునిక యుద్ధ విమానాల నిర్వహణ కోసమే అమెరికా రోజుకు సుమారు 100 మిలియన్ల నుండి 50 మిలియన్ల డాలర్ల (సుమారు 830 నుండి 1,250 కోట్ల రూపాయలు) వరకు ఖర్చు చేస్తోంది. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ల ఇంధనం, వేలాది మంది సైనికుల జీతాలు, నిరంతర గగనతల నిఘా ఖర్చులు అమెరికాకు తడిసి మోపెడు అవుతున్నాయి. ఇరాన్ ప్రయోగించే క్షిపణులను అడ్డుకోవడానికి అమెరికా నౌకాదళం ప్రయోగించే ఒక్కో ‘స్టాండర్డ్ మిస్సైల్-3’ (SM-3) ధర సుమారు 10 మిలియన్ల డాలర్లు అంటే రూ.83 కోట్లకు ఎక్కువే.

యుద్ధం మొదటి రోజే భారీ “బిగినింగ్ కాస్ట్”

యుద్ధం మొదటి రోజు బిలియన్ డాలర్ల నష్టం

యుద్ధం ప్రారంభమైన మొదటి రోజు అమెరికాకు అత్యంత ఖరీదైనది రోజుగా మారింది. మొదటి 24 గంటల్లోనే అమెరికా తన విమాన వాహక నౌకలైన USS జెరాల్డ్ ఆర్. ఫోర్డ్ మరియు USS ఐసెన్‌హోవర్ వంటి స్ట్రైక్ గ్రూపులను యుద్ధ క్షేత్రానికి తరలించడం కోసం, అలాగే అత్యవసర ఆయుధ నిల్వలను ఇజ్రాయెల్‌కు పంపడం కోసం సుమారు 1 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 8,300 కోట్లు) పైగా ఖర్చు చేసింది. యుద్ధం మొదలైన వెంటనే రక్షణ వ్యవస్థలను సిద్ధం చేయడం (Mobilization), అత్యవసర క్షిపణి సరఫరా, గూఢచార విభాగాలను పూర్తిస్థాయిలో రంగంలోకి దించడం వల్ల మొదటి రోజే అమెరికా ఖజానాపై భారీ భారం పడింది.

పన్నుల భారం మోయనున్న ప్రజలు

దీనికి అదనంగా, ఎర్రసముద్రం (Red Sea) లో హౌతీ రెబల్స్ దాడుల నుండి వాణిజ్య నౌకలను కాపాడటానికి చేపట్టిన ‘ఆపరేషన్ ప్రోస్పెరిటీ గార్డియన్’ కోసం కూడా అదనంగా మిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. మొత్తానికి అమెరికా పరోక్షంగా ఇజ్రాయెల్ వైపు నుండి పేల్చే ప్రతి రక్షణ క్షిపణి వెనుక టాక్స్ పేయర్స్ సొమ్మును మంచినీళ్లలా ఖర్చు చేస్తోందనేది వాస్తవం. అంతేకాదు భవిష్యత్తులో అమెరికా తన పౌరుల మీదనే కాకుండా వివిధ దేశాల దిగుమతులపై భారీగా పన్నులు వేయనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అమెరికా పరోక్షంగా ఇజ్రాయెల్ వైపు నుండి రక్షణ కోసం చేస్తున్న ఖర్చు వలన పన్నుల భారం పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో పౌరులు, దిగుమతులపై పన్నులు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.