
📌 Key Points
- పవన్ కళ్యాణ్ ఎనర్జీతో గబ్బర్ సింగ్ రోజులు గుర్తుకు తెచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్!
- ఫస్ట్ హాఫ్‌లో పవన్ కళ్యాణ్, రాశి ఖన్నా మధ్య అదిరిపోయే కామెడీ సీన్స్!
- సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ డైలాగ్స్‌తో ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే కథనం!
- పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్‌తో మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పండగే.
సెన్సార్ పూర్తి.. U/A సర్టిఫికెట్!
Ustaad Bhagat Singh Censor Review; పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. తాజాగా ఈ సినిమా సెన్సార్(Ustaad Bhagat Singh Censor Review) కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఇక సెన్సార్ బోర్డు నుంచి అందుతున్న టాక్ ప్రకారం.. ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయం అని తెలుస్తోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రారంభం నుంచే.. హరీష్ శంకర్ మార్క్ ఎంటర్టైన్మెంట్ మొదలవుతుందట. దానికితోడు పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్, మేనరిజమ్స్, కామెడీ టైమింగ్‌తో ఫస్ట్ హాఫ్‌ను ఒక రేంజ్‌లో నడిపించారట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, రాశి ఖన్నా మధ్య వచ్చే సీన్స్ వినోదాత్మకమైన డైలాగులు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయట. ఆ సీన్స్ లో పవన్ ఎనర్జీ చూస్తుంటే మళ్ళీ ‘గబ్బర్ సింగ్’ రోజులు గుర్తుకురావడం ఖాయం అని సెన్సార్ రిపోర్ట్ చెబుతోంది.
ఫస్ట్ హాఫ్ లో గబ్బర్ సింగ్ గుర్తుకు తెచ్చిన పవన్!
ఇక, సినిమాకు అసలైన హైలైట్ పవర్ ప్యాక్డ్ ఇంటర్వెల్ బ్లాక్ అట. ఊహించని ట్విస్టుతో, భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఇంటర్వెల్ బ్లాక్ సెకండ్ హాఫ్ పై అంచనాలను ఒక్కసారిగా పెంచేస్తుందట. ఇక సెకండ్ హాఫ్ మొత్తం.. ఎమోషనల్ డ్రివెన్ గా సాగుతుందట. ప్రస్తుత సమాజంలో జరిగే కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ చెప్పే ఎమోషనల్ డైలాగ్స్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయట.
సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ డోస్ అదిరింది!
కేవలం మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, బలమైన కథా బలంతో సెకండ్ హాఫ్ సాగడం విశేషంగా చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నెక్స్ట్ లెవల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారట. ముఖ్యంగా, ఎమోషనల్ సీన్లలో ఆయన నటన క్లాస్ ప్రేక్షకులను సైతం మెప్పిస్తుందని చెప్తున్నారు. ఇవన్నీ చేస్తుంటే, మరోసారి గబ్బర్ సింగ్ రేంజ్ బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అని తెలుస్తోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ రివ్యూతో అంచనాలు పెరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


