
📌 Key Points
- పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ అదిరింది, ఫైట్స్ తో ఫ్యాన్స్ కు పూనకాలే!
- తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్, విజిల్స్ వేయాల్సిందే!
- తొలిప్రేమ సాంగ్ రీమిక్స్ హైలైట్, థియేటర్లో డాన్సులే డాన్సులు!
- పవన్ మార్క్ కామెడీతో హరీష్ శంకర్ అదరగొట్టాడు, నవ్వులే నవ్వులు!
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సినిమా ఎలా ఉందో చూద్దాం!
పవన్ కళ్యాణ్ ఎంట్రీ అదిరింది!
Ustaad Bhagat Singh : మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా భారీగా తెరకెక్కిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ – హరీష్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మొదట్లో ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ కి కూడా పెద్దగా ఆశలు లేవు కాని ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా సినిమాపై హైప్ వచ్చింది.
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ రావడంతో ఫ్యాన్స్ లో ఈ సినిమాపై జోష్ వచ్చింది. ఇక ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. టాలీవుడ్ లో పలువురు సినీ ప్రముఖులు, డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమాని చూసారు. దీంతో ఈ సినిమా టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది.
తమన్ మ్యూజిక్ తో థియేటర్ దద్దరిల్లుతుంది!
టాలీవుడ్ సమాచారం ప్రకారం.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రన్ టైం రెండు గంటల 34 నిముషాలు. సెన్సార్ నుంచి కూడా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. హరీష్ శంకర్ రాసిన పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ ని పవన్ అదే రేంజ్ లో చెప్పారట. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. ఎంట్రీ సీన్ తోనే ఒక ఫైట్ పెట్టారట. ఫస్ట్ హాఫ్ లో రెండు ఫైట్స్, సెకండ్ హాఫ్ లో రెండు ఫైట్స్ ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ మాస్ లుక్స్ లో అదరగొడుతూ వన్ మ్యాన్ షోగా సినిమా అంతా నడిపించారని చెప్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజయిన దేఖ్ లేంగే సాలా సాంగ్ లో పవన్ స్టెప్పులు చూసాము. సినిమాలో ఆ సాంగ్, స్టెప్పులు అదిరిపోతాయి. ఆ డ్యాన్స్ కోసం పవన్ బాగానే కష్టపడినట్టు తెలుస్తుంది. కానీ మిగతా పాటలేవి అంతగా ఇంప్రెస్ చేయలేదట. పాటలు అన్ని ఒక్కసారి వినడమే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం తమన్ గట్టిగానే ఇచ్చాడట.
ఈ సినిమాలో మరో హైలెట్ పవన్ కామెడీ. చాన్నాళ్ల తర్వాత పవన్ మార్క్ కామెడీని హరీష్ ఈ సినిమాలో చూపించాడట. ఇంటర్వెల్ బ్యాంగ్ తో పాటు క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కూడా అదిరిపోయింది. సెకండ్ హాఫ్ లో మాత్రం ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో తోలిప్రేమ సినిమాలోని ఓ సాంగ్ ని రీమిక్స్ చేసినట్టు సమాచారం. ఆ సాంగ్ మాత్రం హైలెట్ కానుందట. అలాగే సెకండ్ హాఫ్ లో చైల్డ్ ఎమోషన్ కూడా ఉందట. కథ పరంగా సింపుల్ అనిపించినా ఎంటెర్టైనమెంట్, మాస్ అంశాలతో కమర్షియల్ సినిమాగా పవన్ ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా ఉస్తాద్ ని తెరకెక్కించారని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. ఫ్యాన్స్ ని అయితే ఈ సినిమా కచ్చితంగా మెప్పిస్తుంది.
తొలిప్రేమ సాంగ్ రీమిక్స్ హైలైట్!
ఈ సినిమాకు ప్రీమియర్స్ మాత్రం లేవు. అమెరికాలో నేడు రాత్రికే షోలు పడుతుండగా ఏపీలో మాత్రం రేపు ఉదయం నాలుగు గంటల నుంచే బెనిఫిట్ షోలు పడనున్నాయి. తెలంగాణలో మాత్రం ఉదయం 7 గంటల నుంచి షోలు పడతాయని సమాచారం. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఇది ఒక పండగలాంటి సినిమా అని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


