|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్: పవన్ డైలాగులతో శ్రీలీల ఊచకోత! ఫ్యాన్స్ ఫిదా!!

Published: 15-03-2026, 1:05 PM
ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్: పవన్ డైలాగులతో శ్రీలీల ఊచకోత! ఫ్యాన్స్ ఫిదా!!
  • ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ వేడుక యూసఫ్ గూడాలో ఘనంగా జరిగింది.
  • పవన్ కళ్యాణ్ డైలాగులతో శ్రీలీల, రాశి ఖన్నా సందడి చేశారు.
  • పవన్ స్పీచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
  • ఉగాది సందర్భంగా మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కానుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక యూసఫ్ గూడాలో జరిగింది. ఈ వేడుకలో శ్రీలీల పవన్ కళ్యాణ్ డైలాగులతో అదరగొట్టింది. పవన్ స్పీచ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

యూసఫ్ గూడాలో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ వేడుక

UBS Pre Release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh). ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీ పరీక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు .ఇందులో భాగంగానే చిత్ర బృందం తాజాగా హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లోన్ ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ దర్శకులు ముఖ్య అతిథులుగా పాల్గొని సందడి చేశారు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జోడీగా శ్రీ లీల హీరోయిన్గా నటించగా మరొక హీరోయిన్ రాశి ఖన్నా కూడా కీలకపాత్రలో కనిపించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో వీరిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సుమ పవన్ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్లు చూపిస్తూ అభిమానుల చేత డైలాగులు చెప్పించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఎవరు బాగా చెప్తారో వారికి ఫోన్ అంటూ ఒక టాస్క్ ఇచ్చింది. ఇందులో భాగంగానే శ్రీలీల గబ్బర్ సింగ్ సినిమాలో నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది అనే పవర్ ఫుల్ డైలాగ్ చెప్పడంతో ఒక్కసారిగా అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేశారు.

పవన్ డైలాగులతో అదరగొట్టిన శ్రీలీల, రాశి ఖన్నా

ఇక మరొక హీరోయిన్ రాశి కన్నా సైతం బద్రీ సినిమాలో డైలాగును చెప్పారు. అయితే శ్రీ లీల ఏకంగా సుమని కూడా పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమాలలో ఏ సినిమా ఇష్టం అలాగే డైలాగ్ చెప్పాలి అంటూ ప్రశ్న వేయడంతో సుమా ఏకంగా పవన్ అత్తారింటికి దారేది సినిమాలో చూడప్పా సిద్ధప్పా నేను సింహం లాంటోడిని అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటాను అంటూ సాగిపోయే డైలాగ్ చెబుతూ సందడి చేశారు. ఇలా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ డైలాగులతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సినిమా వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో ఆయన స్పీచ్ గురించి అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

పవన్ స్పీచ్ పై నెలకొన్న ఆసక్తి..

పవన్ కళ్యాణ్ స్పీచ్ పై అభిమానుల ఆసక్తి

ఈ సినిమా అనుకున్న సమయం కంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎక్కడ ప్రమోషన్లలో పాల్గొనలేదు మొదటిసారి ప్రీ రిలీజ్ వేడుకకు హాజరు కావడంతో పవన్ స్పీచ్ పై ఆసక్తి ఉంది. ఇక ఈ కార్యక్రమానికి ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి తదితరులు కూడా హాజరయ్యారు. ఉగాది పండుగ సందర్భంగా మార్చి 19న రాబోతున్న ఈ సినిమా హరీష్ శంకర్ కు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఉస్తాద్ భగత్ పట్ల కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేసాయి.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 19న విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉండబోతుందో చూడటానికి అభిమానులు వేచి ఉన్నారు. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.