
📌 Key Points
- ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త పోస్టర్లో పవన్ కళ్యాణ్ యంగ్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది.
- పవన్ కళ్యాణ్ స్వాగ్, స్టైల్ పోస్టర్లో హైలైట్గా నిలిచాయి.
- ఉత్తర అమెరికాలో మార్చి 25న ప్రీమియర్లు, ప్రపంచవ్యాప్తంగా మార్చి 26న సినిమా విడుదల కానుంది.
- శ్రీలీల కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి సరికొత్త పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్గా, యంగ్గా కనిపిస్తున్నారు. సినిమా మార్చి 26న విడుదల కానుంది.
వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ పోస్టర్
Ustad Bhagat Singh new poster: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తాజాగా విడుదలైన కొత్త పోస్టర్ అభిమానుల్లో భారీ ఆనందాన్ని తీసుకొచ్చింది. ఈ పోస్టర్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుర్చీలో కూర్చుని చాలా స్టైలిష్ గా కనిపించారు. ఆయన కూర్చున్న స్టైల్, ముఖాభినయం, బాడీ లాంగ్వేజ్ అన్నీ కలిసి ఆయనకు మాత్రమే సొంతమైన స్వాగ్‌ను న అభిమానులు మరోసారి పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే పేరు ఎందుకు వచ్చిందో.. ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది అని కామెంట్లు పెడుతున్నారు.
ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ చాలా యంగ్‌గా, కనిపించారు. ఆయన లుక్‌లో మాస్ అప్పీల్ .. ఓ లెవెల్ లో కనిపించడంతో.. సోషల్ మీడియాలో ఈ ఫోటో షేర్ అవుతున్న కొద్దీ అభిమానుల స్పందన మరింత పెరుగుతోంది. చాలా మంది ఈ లుక్ చూసి థియేటర్లలో విజిల్స్, అరుపులు ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. పోస్టర్‌లో సినిమా విడుదలకు ఇంకా 25 రోజులు మాత్రమే ఉన్నాయని పేర్కొనడం ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ పోస్టర్‌లో ఆమె కనిపించకపోయినా, గతంలో విడుదలైన ప్రమోషనల్ పోస్టర్లు, వీడియోల ద్వారా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉందని అభిమానులు ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు. ఈ జోడీని పెద్ద తెరపై చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సినిమా విడుదల తేదీ వివరాలు
నిర్మాతలు మరో ముఖ్యమైన అప్‌డేట్ కూడా ఇచ్చారు. ఉత్తర అమెరికాలో ప్రీమియర్లు మార్చి 25న జరగనున్నట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా సినిమా మార్చి 26, 2026న విడుదల కానుంది. ఈ వార్త ఓవర్సీస్ అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.
ఇటీవల విడుదలైన “డేఖ్లెంగే సాలా” పాటకు అద్భుతమైన స్పందన లభించింది. పవర్ స్టార్ డాన్స్ మూవ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ షూటింగ్ సమయంలో తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ కష్టాన్ని ప్రశంసించారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీమ్ మొత్తం కలిసి పనిచేసిన అనుబంధాన్ని అవి స్పష్టంగా చూపించాయి.
శ్రీలీలతో పవన్ కెమిస్ట్రీ
ఈ కొత్త పోస్టర్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒక పూర్తి స్థాయి అభిమానుల పండుగగా మారబోతోందని స్పష్టంగా తెలుస్తోంది. పవర్ స్టార్ స్వాగ్‌తో థియేటర్లు గర్జించనున్నాయి.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కొత్త లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. థియేటర్లలో పవర్ స్టార్ సందడి ఖాయం.


