|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వైభవ్ విధ్వంసం: క్రీడా, రాజకీయ ప్రముఖులను కట్టిపడేసిన యువ సంచలనం!

Published: 27-05-2026, 5:00 PM
వైభవ్ విధ్వంసం: క్రీడా, రాజకీయ ప్రముఖులను కట్టిపడేసిన యువ సంచలనం!
  • IPL ఎలిమినేటర్ మ్యాచులో రాజస్థాన్ తరపున వైభవ్ 29 బంతుల్లో 97 పరుగులు చేశాడు.
  • 12 సిక్సులు, 5 ఫోర్లతో సన్ రైజర్స్ బౌలర్లను ఊచకోత కోశాడు.
  • యువరాజ్, సచిన్ వంటి క్రీడా ప్రముఖులతో పాటు చిదంబరం, రాహుల్ రవీంద్రన్ ప్రశంసించారు.
  • సెంచరీ మిస్ అవ్వడంతో తీవ్ర భావోద్వేగానికి గురైన వైభవ్.

ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సైతం వైభవ్ ఇన్నింగ్స్‌ను ప్రశంసించడం విశేషం. క్రీడా మైదానంలో ఒక యువకుడి ప్రతిభ రాజకీయ ప్రముఖులను ఎలా ఆకట్టుకుందో ఈ కథనం వివరిస్తుంది.

వైభవ్ విధ్వంసం: 29 బంతుల్లో 97 పరుగుల సునామీ

IPL 2026 సీజన్లో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో రాజస్థాన్ జట్టు హైదరాబాద్ పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 243 పరుగుల భారీ స్కోర్ సాధించింది అంటే ఆ జట్టులోని యంగ్ విధ్వసం వైభవ్ సూర్యవంశీనే కారణం. కేవలం 29 బాల్స్ లో 97 పరుగులు బాదాడు అంటే వైభవ్ పరుగుల సునామీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ 97 పరుగుల్లో సిక్సులు, ఫోర్ల ద్వారానే 92 రన్స్ చేసాడు. ఏకంగా 12 సిక్సులు, 5 ఫోర్లు బాది సన్ రైజర్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. అయితే సెంచరీ మిస్ అవడంతో ఈ యంగ్ బ్యాటర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. దీనంగా పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్లడం ప్రేక్షకుల గుండెల్ని పిండేసింది. బ్యాటుతో తలబాదుకుంటూ వెళ్తుండగా హైదరాబాద్ ప్లేయర్స్ వచ్చి భుజం తట్టడం మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది.

అయితే వైభవ్ సునామీపై క్రీడా ప్రముఖులతో పాటు, సినీ, రాజకీయ నాయకులూ ప్రశంసల వర్షం కురిపించారు. ‘బాస్ బేబీ’ అంటూ యువరాజ్ ట్వీట్ చేయగా, ‘మై గుడ్నెస్.. అతనో అద్భుతం’ అంటూ కెవిన్ పీటర్స్ కొనియాడాడు. ‘వైభవ్ బ్యాట్ స్వింగ్ అద్భుతం’ అని సచిన్ ట్వీట్ చేసాడు. అంతేకాదు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ‘ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్’ అనగా.. ‘వైభవ్ సృష్టించిన హారర్ నుంచి తేరుకోడానికి 5 నిముషాలు పట్టింది’ అని నటుడు రాహుల్ రవీంద్రన్ ప్రశంసించాడు. ఇక IPL లోని అన్ని జట్ల అభిమానులు వైభవ్ నేటి ఆటకు ఫిదా అయిపోయారు.

దిగ్గజాల ప్రశంసలు: సచిన్ నుండి చిదంబరం వరకు

సెంచరీ మిస్: భావోద్వేగానికి గురైన యువ బ్యాటర్

వైభవ్ ప్రదర్శన కేవలం క్రికెట్ అభిమానులనే కాదు, రాజకీయ నాయకులను కూడా ఆకట్టుకుంది. ఇది క్రీడలకు ఉన్న సార్వత్రిక ఆకర్షణను, ఒక యువ ప్రతిభ సమాజంలోని అన్ని వర్గాలను ఎలా ఏకం చేయగలదో తెలియజేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.