
📌 Key Points
- కాచిగూడ-యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌లో మార్పులు.
- మార్చిన టైమింగ్స్ మార్చి 15 నుంచి అమలులోకి వస్తాయి.
- యశ్వంతపూర్-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ హిందూపూర్ చేరే, బయలుదేరే సమయాల్లో మార్పులు.
- వారంలో 6 రోజులు ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది; బుధవారం మాత్రం ఉండదు.
దక్షిణ మధ్య రైల్వే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు ముఖ్యమైన ప్రకటన చేసింది. కాచిగూడ – యశ్వంతపూర్ మధ్య నడిచే రైలు టైమింగ్స్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పులు మార్చి 15 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రయాణికులు గమనించగలరు.
వందే భారత్ టైమింగ్స్‌లో మార్పులు చేసిన రైల్వే శాఖ
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. కాచిగూడ – యశ్వంతపూర్ – కాచిగూడ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైన్ టైమింగ్స్ లో మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త షెడ్యూల్ ను విడుదల చేసింది.
దక్షిణ మధ్య రైల్వే వివరాల ప్రకారం…గతంలో ఉన్న టైమింగ్ ప్రకారం… యశ్వంతపూర్ – కాచిగూడ (ట్రైన్ నెంబర్ 20704) వందే భారత్ ఎక్స్ ప్రెస్ మధ్యాహ్నం 03.48 నిమిషాలకు హిందూపూర్ చేరుకునేది. మధ్యాహ్నం 3.50 నిమిషాలకు బయల్దేరేది. కానీ ఇకపై మధ్యాహ్నం 3.44 నిమిషాలకు యశ్వంతపూర్ నుంచి మధ్యాహ్నం 03.55 నిమిషాలకు చేరుకుని… మధ్యాహ్నం 03. 57 నిమిషాలకు బయల్దేరుతుంది.
ప్రయాణికులకు చేరివేసిన దక్షిణ మధ్య రైల్వే
ఇక కాచిగూడ – యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెంబర్ 20703) మధ్యాహ్నం 12.8 నిమిషాలకు హిందూపూర్ రైల్వే స్టేషన్ చేరుకుని 12.10 నిమిషాలకుగు బయల్దేరేది. కానీ ఇకపై మధ్యాహ్నం 12.17 నిమిషాలకు చేరుకుని… 12.19 నిమిషాలకు బయల్దేరుతుంది. మారిన టైమింగ్స్ మార్చి 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
కొత్త టైమింగ్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి?
కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వారంలో 6 రోజులు రాకపోకలు సాగిస్తుంది. బుధవారం ఒక్క రోజు ఉండదు. ఈ ట్రైన్ మహబూబ్‌నగర్, కర్నూల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా యశ్వంతపూర్ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.
దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులపై ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి. కొత్త టైమింగ్‌లను గమనించి మీ ప్రయాణాలను ప్లాన్ చేసుకోండి. మరింత సమాచారం కోసం రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.


