|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: చెల్లి షార్ట్ స్కట్ వేస్తే రేప్ చేయాలనిపిస్తుందా? హీరోయిన్ సంచలన కామెంట్స్ వైరల్!

Published: 04-03-2026, 2:05 PM
షాకింగ్: చెల్లి షార్ట్ స్కట్ వేస్తే రేప్ చేయాలనిపిస్తుందా? హీరోయిన్ సంచలన కామెంట్స్ వైరల్!
  • వరలక్ష్మి శరత్‌కుమార్ దర్శకత్వంలో ‘సరస్వతి’ చిత్రం మార్చి 6న విడుదల!
  • ప్రియమణి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు!
  • దుస్తుల గురించి వరలక్ష్మి చేసిన కామెంట్స్‌తో సోషల్ మీడియాలో దుమారం!
  • మగాళ్ల ఆలోచన ధోరణిపై వరలక్ష్మి ప్రశ్నలు.. సమాధానం చెప్పగలరా?

వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్‌గానే కాకుండా డైరెక్టర్‌గా కూడా తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఆమె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరస్వతి’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

దుస్తులపై వరలక్ష్మి సంచలన వ్యాఖ్యలు!

నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇప్పుడు డైరెక్షన్‌లోకి అడుగు పెట్టింది. ఆమె స్వీయ దర్శకత్వంలో ప్రియమణి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సరస్వతి’. మార్చి 6న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండటంతో.. ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి శరత్ కుమార్ మహిళల డ్రెస్సింగ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

మహిళలు వేసుకునే బట్టల కారణంగానే చాలా తప్పులు జరుగుతున్నాయని కొంతమంది మెన్స్ అభిప్రాయపడుతున్నారు.. దీనిపై మీరు ఏమంటారు అని యాంకర్ ప్రశ్నించగా.. ‘మీకు ఒక చెల్లి ఉంది. ఆ చెల్లి ఒక షాట్ స్కట్ వేసుకుని వెళ్తుంది.. తనని రేప్ చేయాలని మీకు అనిపిస్తుందా? అనిపించదు కదా. ఇప్పుడు మగాళ్లు కూడా ఒక జీన్ ప్యాంట్ ఎంత Low ఉంటుంది అంటే బెండ్ చేస్తే మొత్తం తెలుస్తుంది. అలాఅని నేను పోయి వాడిని జంప్ చేసి ఇలా చెయ్, అలా చెయ్ అని చెప్పను కదా.. ఇప్పుడు ఇన్నర్ వేర్ అనేది అందరూ ఉపయోగిస్తారు. మీరు కూడా చెడ్డీలు వేసుకుంటారు. మీది అందరికి కనిపిస్తది పర్వాలేదు. కానీ ఒక ఉమెన్ ది బ్రా స్ట్రాప్ బయటకు కనిపిస్తే చాలు గోల గోల చేస్తారు. లైఫ్ మొత్తం పోయింది అన్నట్లు చేస్తారు. ఏం ఉంది అందులో ఒక ఇన్నర్ వేర్ అంతే కదా. ఊరికే జడ్జ్ చేస్తారు ఎందుకు.. వాళ్ల బాడీ వాళ్ల ఇష్టం కదా. ఇప్పుడు మీ అమ్మతో, చెల్లితో మీకు అలాంటి ఫీల్ లేనప్పుడు బయట అమ్మాయి దగ్గర ఎందుకు ఆ ఫీల్ వస్తుంది’ అంటూ ఫైర్ అయింది. ప్రజెంట్ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సంచనలంగా మారాయి.

‘సరస్వతి’ మూవీ ప్రమోషన్స్‌లో షాకింగ్ కామెంట్స్!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వరలక్ష్మి కామెంట్స్!

వరలక్ష్మి శరత్‌కుమార్ కామెంట్స్‌తో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.