|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: తెలుగు రాజకీయాల్లోకి వరలక్ష్మి ఎంట్రీ ఫిక్స్! ఏ పార్టీలోనో తెలుసా?

Published: 04-03-2026, 9:35 PM
షాకింగ్: తెలుగు రాజకీయాల్లోకి వరలక్ష్మి ఎంట్రీ ఫిక్స్! ఏ పార్టీలోనో తెలుసా?
  • వరలక్ష్మి శరత్ కుమార్: త్వరలో ఆంధ్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం!
  • రాజకీయాల్లోకి యువత రావాలని పిలుపునిచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్.
  • సరస్వతి సినిమాలో మెయిన్ లీడ్ లో నటిస్తున్న వరలక్ష్మి.
  • మార్చి 6న విడుదల కానున్న ‘సరస్వతి’ చిత్రం.

వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన నిర్ణయం! హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న ఈమె, ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు టాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి.

రాజకీయాలపై వరలక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు!

Varalaxmi Sarathkumar : హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తమిళ్, తెలుగులో ఫుల్ బిజీగా ఉంది వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పుడు దర్శకురాలిగా కూడా మారింది. వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ లో నటిస్తూ తెరకెక్కిస్తున్న సినిమా సరస్వతి. ఈ సినిమా మార్చ్ 6న రిలీజ్ అవుతుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరలక్ష్మి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ?

వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. నాకు పాలిటిక్స్ అంటే ఇష్టమే. కచ్చితంగా ఏదో ఒక రోజు పాలిటిక్స్ లోకి వస్తాను. పాలిటిక్స్ అనేది బ్యాడ్ వర్డ్ కాదు. పాలిటిక్స్ లోకి యంగ్ పీపుల్ ఇంకా చాలా మంది రావాలి. ఎవరో 70 ఏళ్ళ వ్యక్తులు వచ్చి రాజకీయం చేస్తే వాళ్లకు ఇక్కడ ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది. ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి యంగ్ స్టర్స్ రాజకీయాల్లోకి రావాలి. తమిళనాడులో కాదు ఇక్కడ ఆంధ్ర రాజకీయాల్లోకి నేను రావొచ్చు అని తెలిపింది.

‘సరస్వతి’ సినిమా ప్రమోషన్లలో పాలిటిక్స్ గురించి కామెంట్స్

దీంతో భవిష్యత్తులో వరలక్ష్మి పాలిటిక్స్ లోకి వస్తుందని క్లారిటీ ఇచ్చేసింది. కానీ ఆంధ్ర పాలిటిక్స్ లోకి రావొచ్చు అనడంతో ఇక్కడ ఏ పార్టీలో చేరుతుందో, ఎప్పుడు వస్తుందో అని ఆసక్తి నెలకొంది. మరి ఈ లేడీ బాస్ రాజకీయ అరంగ్రేటం ఎప్పుడు ఎక్కడ ఉంటుందో చూడాలి.

వరలక్ష్మి శరత్ కుమార్ రాజకీయ ప్రవేశం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఏ పార్టీలో చేరుతారు, ఎప్పుడు వస్తారు అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.