
📌 Key Points
- మల్లారెడ్డి సినీ రంగ ప్రవేశం ఖాయమని ప్రకటించారు.
- తన బయోపిక్ సినిమాకు తానే నిర్మాతగా వ్యవహరిస్తానని తెలిపారు.
- విలన్ పాత్రలు కాకుండా మంచి పాత్రల్లో నటిస్తానని స్పష్టం చేశారు.
- గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ ఆఫర్‌ను తిరస్కరించారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలితో ఆకట్టుకున్న మల్లారెడ్డి సినీ రంగ ప్రవేశంపై సంచలన ప్రకటన చేశారు. తాను సినిమాల్లోకి రావడం ఖాయమని, తన బయోపిక్‌ను తానే నిర్మిస్తానని స్పష్టం చేశారు. మంచి పాత్రల్లో నటిస్తానని, విలన్ పాత్రలు మాత్రం చేయనని తెలిపారు.
మల్లారెడ్డి సినీ ప్రవేశంపై క్లారిటీ
Malla Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తనదైన శైలిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న నాయకులలో మల్లారెడ్డి ఒకరు. పాలమ్మినా, పూలమ్మిన అంటూ తన అద్భుతమైన స్పీచ్ తో, తన మేనరిజంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక మల్లారెడ్డి రాజకీయాలలో మాత్రమే కాకుండా మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ కూడా రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా విద్యావేత్తగా రాజకీయ నాయకుడిగా మంచి ఆదరణను సొంతం చేసుకున్న మల్లారెడ్డి సినిమాలలోకి రాబోతున్నారా అంటే అవుననే చెప్పాలి . మల్లారెడ్డికి నటనపై ఎంతో ఆసక్తి ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయనకు సినిమాలలో అవకాశాలు కూడా రావడంతో రిజెక్ట్ చేసినట్లు తెలిపారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)సినిమాలో ఈయనకు విలన్ పాత్రలో అవకాశం రావడంతో విలన్ అంటే హీరో తన్నులు తినాల్సి ఉంటుంది అందుకే తాను ఈ సినిమా చేయలేదని మల్లారెడ్డి తెలిపారు. తాజాగా మల్లారెడ్డి ఒక కార్యక్రమంలో భాగంగా సినిమాలలోకి రావడం గురించి స్పందిస్తూ సినిమాలలోకి రావడం పై అభిప్రాయాలను తెలియజేశారు. తాను సినిమాలలోకి రావడం పక్కా అంటూ ఈయన ఇండస్ట్రీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు.
బయోపిక్‌కు తానే నిర్మాత
కచ్చితంగా తాను సినిమాలలోకి వస్తానని అయితే ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత తన బయోపిక్ (Biopic Movie)సినిమా చేయాలని కోరికగా ఉందని అయితే ఈ బయోపిక్ సినిమాకు తానే నిర్మాతగా వ్యవహరిస్తాను అంటూ మల్లారెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా మల్లారెడ్డి తన బయోపిక్ సినిమాను ప్రకటించడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి మల్లారెడ్డి బయోపిక్ సినిమా ద్వారా హీరోగా ఎవరు ముందుకు వస్తారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక సినిమాలలో నటించడం గురించి కూడా ఈయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను సినిమాలలో ఏదైనా మంచి పాత్రలలో చేసే అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తానని తెలిపారు.
విలన్ పాత్రలు మాత్రం చెయ్యను..
విలన్ పాత్రలు చేయనన్న మల్లారెడ్డి
సినిమాలలో విలన్ పాత్రలు కాకుండా ఇతర కీలక పాత్రలలో నటించడానికి తాను సిద్ధమే అంటూ మల్లారెడ్డి ఈ సందర్భంగా ఇండస్ట్రీలోకి రావడం గురించి క్లారిటీ ఇచ్చారు .మరి ఈయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈయనకు అనుగుణంగా ఉన్న పాత్రలను ఏ డైరెక్టర్ రాస్తారు ?ఈయన ఏ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతారు? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక ఇటీవల కాలంలో మల్లారెడ్డి కేవలం రాజకీయ వ్యవహారాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు అలాగే పలు బుల్లి తెర కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ మల్లారెడ్డి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
మల్లారెడ్డి సినీ ప్రవేశం, బయోపిక్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఏ పాత్రల్లో నటిస్తారు, బయోపిక్‌లో ఎవరు నటిస్తారు అనే విషయాలపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


