|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వరుణ్, లావణ్యల ముద్దుల తనయుడితో సందడి.. వైరల్ అవుతున్న వీడియో!

Published: 28-02-2026, 6:35 AM
వరుణ్, లావణ్యల ముద్దుల తనయుడితో సందడి.. వైరల్ అవుతున్న వీడియో!
  • వరుణ్, లావణ్యల కుమారుడు వాయువ్ తేజ్ పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
  • కొరియన్ కనకరాజు సినిమాలో వరుణ్ కొత్త తరహా హారర్ థ్రిల్లర్ పాత్రలో కనిపించనున్నాడు.
  • వరుణ్, లావణ్య తమ కుమారుడితో ఆడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
  • వరుణ్ తన కెరీర్‌లో మొదటిసారిగా హారర్ థ్రిల్లర్ జోనర్‌ను ఎంచుకున్నాడు.

టాలీవుడ్ క్యూట్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ కుమారుడు వాయువ్ తేజ్‌తో కలిసి ఒక వివాహ వేడుకలో సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుణ్ కొత్త సినిమా విశేషాలు కూడా ఉన్నాయి.

పెళ్లి వేడుకలో వాయువ్ తేజ్ సందడి

Varun Tej -Lavanya: టాలీవుడ్ క్యూట్ కపుల్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. తమ ముద్దుల కుమారుడు వాయువ్ తేజ్ తో కలిసి ఒక వివాహ వేడుకలో సందడి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. లావణ్య త్రిపాఠి సోదరుడు పెళ్లి వేడుకలో ఈ మెగా వారసుడు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవగా, వరుణ్ దంపతులు తమ బాబుతో ఆడుకుంటున్న వీడియోలు అభిమానుల మనసు గెలుచుకుంటున్నాయి. ఆ వివరాలు ఇలా వున్నాయి..

వరుణ్ తేజ్ మరియు లావణ్య తమ వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచుతారు, కానీ ఈసారి లావణ్య సోదరుడి వివాహ వేడుకలో మాత్రం ఈ ఫ్యామిలీ ఫుల్ ఎంజాయ్ చేసింది. 2023 నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న ఈ జంటకు, గత ఏడాది సెప్టెంబర్ 10న వాయువ్ జన్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ బుజ్జి వారసుడిని ఎత్తుకుని వరుణ్, లావణ్య పెళ్లి పనుల్లో చురుగ్గా పాల్గొనడం, బాబుతో కలిసి కెమెరాకు ఫోజులివ్వడం చూస్తుంటే ముచ్చటేస్తోంది. మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోలను షేర్ చేస్తూ లవ్లీ మెగా ప్రిన్స్  అంటూ సంబరపడిపోతున్నారు.

ఇక వరుణ్ వరుసగా చేసిన సినిమాలు నిరాశపరిచినప్పటికీ ఈసారి రూటు మార్చి ఒక డిఫరెంట్ జోనర్‌ను ఎంచుకున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ‘కొరియన్ కనకరాజు’ సినిమాపై వరుణ్ భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇదొక యూనిక్ హారర్ థ్రిల్లర్ అని సమాచారం. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వరుణ్ తన కెరీర్‌లో చేస్తున్న ఈ సరికొత్త ప్రయోగం కచ్చితంగా హిట్ కొడుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

కొత్త సినిమాతో వరుణ్ తేజ్

కొత్త లైఫ్ ఎంజాయ్ చేస్తున్న వరుణ్-లావణ్య..

వరుణ్-లావణ్య దంపతులు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా,  తమ కుమారుడు వాయువ్ కోసం సమయాన్ని కేటాయిస్తున్నారు. వాయువ్ పేరులో ఉన్న ప్రత్యేకత, కొణిదెల వంశపు వారసుడిగా తన ఎంట్రీ మెగా ఫ్యామిలీలో,ఫాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ పెళ్లి వేడుకలో వరుణ్ తన బాబును ఆడించడం చూస్తుంటే, ఆయన ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా తన కొత్త బాధ్యతలను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారని అర్థమవుతోంది. అటు ప్రొఫెషనల్ లైఫ్‌లో ‘కొరియన్ కనకరాజు’తో సక్సెస్ కోసం వెయిట్ చేస్తూనే, ఇటు పర్సనల్ లైఫ్‌లో ఫ్యామిలీతో గడుపుతూ వరుణ్ ఫుల్ హ్యాపీగా కనిపిస్తున్నారు. మరోవైపు లావణ్య త్రిపాఠి కూడా పెళ్లి తర్వాత సినిమాలలో నటిస్తున్నారు ఈమె సతి లీలావతి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మార్చి 6 వ తేదీ విడుదల కాబోతోంది.

ఫ్యామిలీతో వరుణ్, లావణ్య

?igsh=MTVrNWdvc3IxMTkydA%3D%3D

మొత్తానికి వరుణ్ తేజ్ ఒకవైపు ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో బిజీగా ఉంటూనే, మరోవైపు తన ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతున్నారు. ఈ వీడియో వారి అభిమానులకు కనువిందు చేస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.