|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బేబీ గర్ల్ పేరెంట్స్‌కు VD-14 టీమ్ బంపరాఫర్.. మీ పాప సినిమాలో పాల్గొనే చాన్స్(ట్వీట్)

Published: 09-07-2025, 12:45 AM
బేబీ గర్ల్ పేరెంట్స్‌కు VD-14 టీమ్ బంపరాఫర్.. మీ పాప సినిమాలో పాల్గొనే చాన్స్(ట్వీట్)

విజయ్ దేవరకొండ నటించే VD-14 సినిమా టీమ్, చిన్నారి బాలికలను సినిమాలో నటింపజేయడానికి అవకాశం ఇస్తున్నారు. వయసు, ఎత్తు, మరియు చర్మవర్ణం సంబంధించిన నిర్దిష్ట లక్షణాలు ఉండాలి.

Key Points

1

VD-14 చిత్రబృందం బేబీ గర్ల్స్‌కు అవకాశం ఇస్తున్నారు.

2

4-5 ఏళ్ల, 3 అడుగుల 2 అంగుళాల కంటే తక్కువ ఎత్తు ఉన్న బేబీ గర్ల్స్‌కు అవకాశం.

4

నటించాలనుకునేవారు ఫోటోలను నిర్ణీత నంబర్‌కు పంపాలి.

VD-14 సినిమాలో బేబీ గర్ల్ పాత్ర

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ‘వీడీ-14’(VD-14) ఒకటి. రాహుల్‌ సంకృత్యాన్(Rahul Sankruthyan) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించ‌బోతుంది. పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో రాయలసీమ నేపథ్యంలో 1854 – 1878 మధ్య కాలంలో జరిగే ఆసక్తికర కథాంశంతో రూపొందనుంది. దీంట్లో విజయ్‌ ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ సినిమాలో ర‌ష్మిక(Rashmika Mandanna) క‌థానాయిక‌గా న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ టీమ్ బేబీ గర్ల్ తల్లులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. సినిమాలో పాల్గొనే చాన్స్ ఉందని తెలుపుతూ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. ‘మేము ఒక చిన్న బేబీ గర్ల్ కోసం ఎదురు చూస్తున్నాము. అయితే ఆ పాప ఏజ్ 4 నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఉండాలి.. హైట్ వచ్చేసి 3ఫీట్ 2ఇంచెస్‌కి తక్కువగా ఉండాలి.. ఇక స్కిన్ కలర్ డస్కీ అండ్ డార్క్‌‌‌గా పాప సన్నగా ఉండాలి’ అని రాసుకొచ్చారు. అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు తమ పాపల ఫొటోస్‌ను ఈ నెంబర్‌కి పంపండి అని నెంబర్ మెన్షన్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా పైన చెప్పిన పోలికలతో పాప ఉంటే వెంటనే కింద ఇచ్చిన నెంబర్‌కి ఫొటోస్ షేర్ చేసి మూవీలో నటించే చాన్స్ కొట్టేయండి. Link

పాత్ర కోసం అవసరమైన లక్షణాలు

ఆసక్తి ఉన్నవారు ఏం చేయాలి

చిన్నారులకు సినిమాల్లో నటించే అవకాశం ఇవ్వడం చాలా ఆనందదాయకం. VD-14 చిత్రబృందం ఈ అవకాశాన్ని అందించడం అభినందనీయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.