|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వీడే మన వారసుడు: రైతుల మీద తీసిన సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..

Published: 27-06-2025, 4:22 PM
వీడే మన వారసుడు: రైతుల మీద తీసిన సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..

రైతుల జీవితాలను తెరపై ఆవిష్కరిస్తూ తెరకెక్కుతున్న సినిమా ‘వీడే మన వారసుడు’. రమేష్ ఉప్పు నటన మరియు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూలై 18న విడుదల కానుంది. లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ తదితరులు నటిస్తున్నారు.

Key Points

1

రైతుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘వీడే మన వారసుడు’.

2

రమేష్ ఉప్పు దర్శకత్వం, నటనలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.

4

జూలై 29న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది.

కథానాయకుడు మరియు నటీనటులు

Veede Mana Varasudu : రైతుల జీవితాలపై తెరకెక్కుతున్న సందేశాత్మక సినిమా ‘వీడే మన వారసుడు’. అర్.ఎస్ ఆర్ట్స్ బ్యానర్ పై రమేష్ ఉప్పు మెయిన్ లీడ్ లో నటిస్తూ ఈ సినిమాని దర్శక నిర్మాతగా తెరకెక్కిస్తున్నాడు. లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్, సమ్మెట‌ గాంధీ, విజయ రంగరాజు, ఆనంద్ భారతి, గూడూరు కిషోర్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 18న తెలుగులో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు.

విడుదల తేదీ మరియు ప్రీ-రిలీజ్ ఈవెంట్

సినిమా కథాంశం

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌నిర్మాత రమేష్ ఉప్పు మాట్లాడుతూ.. స‌మాజానికి మంచి సందేశం అందిస్తుంది మా సినిమా. రైతుల పోరాటం, మాదక ద్రవ్యాల ప్రభావం వంటి అమాశాలు ఉన్నాయి. సెన్సార్ బోర్డు స‌భ్యుల‌తో పాటు, ప్రీమియ‌ర్ షో చూసిన ప‌లువురు ప్ర‌ముఖులు సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించ‌డంతో మా న‌మ్మ‌కం మ‌రింతా పెరిగింది. మా శ్ర‌మ‌కు మంచి సక్సెస్ అందుతుందనే నమ్మకం బ‌లంగా ఉంది. రైతుల కష్టాలను అర్థవంతంగా ఆవిష్కరించాం అని తెలిపారు. అలాగే ఈ నెల 29న మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిచబోతున్నట్టు ప్రకటించారు.

‘వీడే మన వారసుడు’ సినిమా రైతుల కష్టాలను ప్రతిబింబించి, సమాజానికి మంచి సందేశం అందించాలని దర్శకుడు ఆశిస్తున్నాడు. సినిమాకు మంచి విజయం దక్కాలని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.