|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వెంకటేష్, కళ్యాణ్ రామ్ చేతిలో అనిల్ రావిపూడి బలి! రక్త తిలకం వీడియో వైరల్!

Published: 21-06-2026, 11:51 PM
వెంకటేష్, కళ్యాణ్ రామ్ చేతిలో అనిల్ రావిపూడి బలి! రక్త తిలకం వీడియో వైరల్!
  • వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో అనిల్ రావిపూడి భారీ మల్టీస్టారర్.
  • #VenkyAnil5, #NKRAR2 వర్కింగ్ టైటిల్స్ తో షూటింగ్ ప్రారంభం.
  • అనిల్ రక్తంతో వీర తిలకం దిద్దిన వెంకీ, కళ్యాణ్ రామ్.
  • కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన అనిల్ రావిపూడి, వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ సినిమా షూటింగ్ మొదలైంది! ఈ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అసలేం జరిగింది? చూద్దాం రండి!

అనిల్ ప్రమోషన్స్ మామూలుగా లేవుగా!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , కళ్యాణ్ రామ్ హీరోలుగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. #VenkyAnil5 #NKRAR2 వర్కింగ్ టైటిల్స్ తో పిలుచుకుంటున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తాజా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ, చిత్ర బృందం సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియోని షేర్ చేసింది. సినిమాలకు ప్రమోషన్స్‌ చేయడంలో డైరెక్టర్ అనిల్‌ రావిపూడి స్టైలే వేరు. అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి, థియేటర్లలో బొమ్మ పడే వరకూ రకరకాల ప్రమోషనల్ స్ట్రాటజీలతో అందరూ తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తుంటారు. ‘వెంకీ – కళ్యాణ్ రామ్’ మూవీ విషయంలోనూ తనదైన శైలిలో పబ్లిసిటీ చేస్తున్నారు. రీసెంట్ గా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్, గేయ రచయిత అనంత్‌ శ్రీరామ్‌లను ఇసుకలో పాతిపెట్టిన రావిపూడి.. ఇప్పుడు ఓ కత్తిలాంటి ప్రమోషనల్ ఐడియాతో వచ్చారు. ”రావిపూడి రక్తంతో విజయ తిలకం దిద్దిన టీం” అంటూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో జీవి ప్రకాష్ కుమార్ ను ఇసుకలో పాతిపెట్టడం గురించి ఆవేదన వ్యక్తం చేసిన వెంకటేష్.. అనిల్ ను చూస్తే వణుకు వచ్చేస్తుందని సరదాగా అంటారు. ‘పటాస్’ సినిమా చేసినప్పుడు బాగానే ఉన్నాడని, కానీ వెంకీ గారాబం వల్లే ఇలా తయారయ్యాడని, ‘నేను పాడతా’ అనే దగ్గర నుంచి ఈయన్ని పాతేసే దాకా తీసుకొచ్చారని కళ్యాణ్ రామ్ అన్నారు. అప్పుడే అనిల్ రావిపూడి తలపాగా పెట్టుకొని, ఓ పెద్ద కత్తి పట్టుకొని ఎంట్రీ ఇచ్చారు. కత్తిలాంటి ప్రమోషన్స్ చేస్తున్నారని, ఫ్యాన్స్ తన చేతిలో కత్తి పెట్టి ‘కాన్సెప్ట్ కింగ్’ అనే బిరుదు ఇచ్చారని దర్శకుడు తెలిపారు. ఎప్పుడూ తానే ఐడియాలు ఇస్తానని, ఈసారి టీమ్ ఏదైనా ఐడియా ఇవ్వాలని అనిల్‌ రావిపూడి అడుగుతారు. అప్పుడు కత్తిలాంటి ఐడియా ఇస్తానని చెప్పిన వెంకటేష్.. ఆ కత్తి తీసుకొని అనిల్ రావిపూడి వేలు కోసి మరీ ఆయనకే వీర తిలకం దిద్దుతారు. “అబ్బబ్బా.. రావిపూడి రక్తంతో విజయ తిలకం దిద్దిన వెంకటేష్ గారూ” అంటూ పక్కనే ఉన్న మరో హీరో కళ్యాణ్ రామ్ కూడా అనిల్ చేయి కోసి తిలకం దిద్దుతారు. కీర్తి సురేష్, కృతిశెట్టిలు కూడా ఇదే పని చేయడంతో.. ఇదంతా చూస్తున్న జీవి ప్రకాష్ కుమార్ ముసిముసి నవ్వులు నవ్వుతారు. తనకు బ్రేక్ పాస్ట్ వద్దని, కడుపు నిండిపోయిందంటూ అనిల్ రావిపూడి వేలు మీద గుండు సూదితో గుచ్చుతాడు. ‘ఎంత రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ అయితే మాత్రం మరీ అంత రక్తపాతం అవసరమా.. మనది ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌’ అంటూ అనిల్‌ రావిపూడి చెప్పడంతో ఈ వీడియో పూర్తవుతుంది. రాయలసీమ నేపథ్యంలో కథ నడిచినప్పటికీ, ఇది ఓన్లీ నవ్వుల కోలాటం అని క్లారిటీ ఇచ్చారు. “మేమంతా ఇప్పుడు కలిశాం.. వచ్చే సంక్రాంతికి మిమ్మల్ని కలుస్తాం” అంటూ 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. ఈ వీడియో సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. అనిల్ అప్పుడే మొదలు పెట్టేశాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వెంకటేష్ – కళ్యాణ్ రామ్ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో షైన్‌ స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సోమవారం రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఏకధాటిగా చిత్రీకరణ చేసి, ఆరు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మూవీ టైటిల్ కూడా సంక్రాంతి పండగకు రిలేటెడ్ ఉండేలా ఆలోచిస్తున్నారని సమాచారం.

వెంకీ, కళ్యాణ్ రామ్ ల వీర తిలకం!

కీర్తి, కృతి కూడా వదల్లేదు!

వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మరిన్ని సంచలన వార్తలతో ముందుకు వస్తుందని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.