
📌 Key Points
- ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ వాయిదా, హను రాఘవపూడి ‘ఫౌజీ’కి తొలి ప్రాధాన్యత!
- 2026 దసరాకి ‘ఫౌజీ’ విడుదల, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో ప్రభాస్ విశ్వరూపం చూసేందుకు సిద్ధంగా ఉండండి!
- ‘స్పిరిట్’ 2027 మార్చి 5న విడుదల, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ సరికొత్త అవతారం!
- ప్రభాస్ నిర్ణయం టాలీవుడ్‌లో సంచలనం, రెండు సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేయడానికి రెడీ!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాను పక్కనపెట్టి, హను రాఘవపూడి సినిమాకు ఓకే చెప్పారట. ఈ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
సందీప్ రెడ్డి సినిమాకు బ్రేక్ వేసిన ప్రభాస్
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు ప్రభాస్. మొన్న సంక్రాంతికి ది రాజా సాబ్ సినిమాతో మెరిశారు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. నష్టాలనే మిగిల్చినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తన తర్వాతి ప్రాజెక్టులపై ప్రభాస్ ఫోకస్ చేశాడు. ప్రస్తుతం స్పిరిట్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడట ప్రభాస్. ఈ మూవీ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా భారీ యాక్షన్ నేపథ్యంలో వస్తోంది.
స్పిరిట్ సినిమా షూటింగ్ లో ఉన్న ప్రభాస్, ఇప్పుడు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కంటే, ముందు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తోన్న ఫౌజీ సినిమా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడట ప్రభాస్. ఈ మూవీని 2026 దసరా సందర్భంగా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారట. దీంతో స్పిరిట్ కంటే ముందు ఈ ఫౌజీ సినిమాను ఫినిష్ చేయాలని అనుకుంటున్నారట. అందుకే స్పిరిట్ షూటింగ్ ఆపేసి, ఫౌజీ ఫినిష్ చేయాలని స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్పిరిట్ మిగతా పార్ట్ షూటింగ్ షూటింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. స్పిరిట్ సినిమా 2027 మార్చి 5వ తేదీన రిలీజ్ కానుంది. అందుకే ముందుగా ఫౌజీ పూర్తి చేయాలని అనుకుంటున్నారట.
హను రాఘవపూడితో ప్రభాస్ మూవీ ఎప్పుడంటే?
‘ఫౌజీ’తో ప్రభాస్ రికార్డ్స్ బ్రేక్!
ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘ఫౌజీ’ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


