
📌 Key Points
- వెంకటేష్ కామెడీ టైమింగ్, ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందారు.
- చిరంజీవితో కలిసి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో నటించారు.
- సినిమాలో వెంకీ గౌడ పాత్రకు మంచి స్పందన వచ్చింది.
- భార్యను నీరజా గౌడ అని పిలిస్తే ఆమె ఫీలయ్యిందని వెంకటేష్ అన్నారు.
టాలీవుడ్ నటుడు వెంకటేష్ తన భార్య గురించి తొలిసారిగా మాట్లాడారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో తన పాత్ర పేరుతో ఆమెను పిలిస్తే ఆమె ఎలా ఫీలయ్యారో ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వెంకటేష్ సినీ ప్రస్థానం
Venkatesh:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా కుటుంబంగా పేరు దక్కించుకున్న దగ్గుబాటి కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు వెంకటేష్ (Venkatesh ) తన అద్భుతమైన నటనతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఫ్యామిలీ హీరోగా పేరు దక్కించుకున్నారు. ఆరు పదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన.. ఒకవైపు సోలో హీరో గానే కాకుండా మరొకవైపు ఇతర హీరోల చిత్రాలలో కీలక పాత్రలు పోసిస్తూ ఆ చిత్రాల విజయానికి తన వంతు పాటు పడుతున్నారు.
అలాంటి ఈయన తాజాగా నటించిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ కీలక పాత్ర పోషించారు.ప్రస్తుతం ఈ సినిమా కమర్షియల్ పరంగా దూసుకుపోతుంది. మంచి కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మొదటి ఐదు రోజుల్లోనే 200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది.ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి , వెంకటేష్, అనిల్ రావిపూడి కలసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.అందులో భాగంగానే మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ వెంకీ గౌడ అనే పాత్రలో కనిపించారు.. దీంతో అప్పటినుంచి వెంకీని సోషల్ మీడియాలో ఆయన అభిమానులు వెంకీ గౌడ అంటూ ఆప్యాయతగా పలకరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ విషయంపై స్పందించారు వెంకటేష్.
‘మన శంకర వరప్రసాద్ గారు’ విజయం
ఆయన మాట్లాడుతూ.. అందరూ నన్ను వెంకీగౌడ అని పిలుస్తున్నారు. అయితే ఒకసారి ఎవరో మా ఆవిడను నీరజా గౌడ అని పిలిచారట. ఆమెకు చాలా ఎంబారసింగ్ గా అనిపించి ఆమె ఎంతో ఫీలయ్యి.. ఏడ్చేసింది కూడా ” అంటూ సరదాగా నవ్వుతూ చెప్పుకొచ్చారు వెంకటేష్ . ఇక వెంకటేష్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా తన ఫ్యామిలీ గురించి ఎక్కడ స్పందించని వెంకటేష్ తొలిసారి తన భార్య గురించి మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
భార్య గురించి వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
గత ఏడాది సంక్రాంతి పండుగకు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేసి సంక్రాంతి రేసులో విజయం సాధించారు వెంకటేష్. అంతేకాదు ఈ సినిమా ప్రాంతీయంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇక మళ్లీ ఈ ఏడాది మన శంకర్ వరప్రసాద్ గారు అనే చిత్రంలో కీలకపాత్ర పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. పైగా ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది
మొత్తానికి వెంకటేష్ తన భార్య గురించి మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఫ్యామిలీ గురించి ఎప్పుడూ మాట్లాడని వెంకటేష్ ఈసారి స్పందించడం విశేషం.


