
📌 Key Points
- వెంకటేష్ తన కొత్త సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 – ఏకే 47’లో నటిస్తున్నారు.
- ఈ చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది, ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్.
- వెంకటేష్ ఇంస్టాగ్రామ్ ద్వారా రమణ మహర్షి కొటేషన్ పంచుకున్నారు.
- ‘నిన్ను నువ్వు అర్థం చేసుకోలేనప్పుడు.. సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడంలో ఉపయోగం ఏముంది?’ అనేది కొటేషన్ సారాంశం.
విక్టరీ వెంకటేష్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక కొత్త కొటేషన్‌ను పంచుకున్నారు. రమణ మహర్షి చెప్పిన ఈ కొటేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన కొత్త చిత్రం కూడా రాబోతుంది.
వెంకటేష్ కొత్త సినిమా విశేషాలు
Venkatesh:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు విక్టరీ వెంకటేష్ (Venkatesh ). విభిన్నమైన జానర్ లలో నటిస్తూ.. అటు మాస్ హీరోగా.. ఇటు యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యారు. ఎక్కువగా మహిళ ఆడియన్స్ ను టార్గెట్గా చేసుకొని.. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విక్టరీ వెంకటేష్ ..గత ఏడాది ‘ సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకొని.. సంక్రాంతికి ఇండస్ట్రీ హిట్ గా నిలిచారు. అలాంటి ఈయన మళ్లీ ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో వెంకీ గౌడ పాత్రలో నటించి తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు.
అలా ఈ సంక్రాంతికి కూడా సక్సెస్ అందుకున్న వెంకటేష్.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో తన 77వ చిత్రంగా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 – ఏకే 47’ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. డిసెంబర్ 2025లోనే అధికారికంగా ప్రకటించిన ఈ చిత్రానికి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది వేసవి టార్గెట్గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్లో వేగంగా పాల్గొంటున్న వెంకటేష్.. మరొకవైపు సోషల్ మీడియాలో కూడా బిజీగా మారిపోయారు. అందులో భాగంగానే ఇంస్టాగ్రామ్ ద్వారా రోజుకొక కొత్త కొటేషన్ షేర్ చేస్తూ అభిమానులలో కొత్త ఉత్తేజాన్ని నింపుతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో వెంకీ మామ కొటేషన్
ఈ క్రమంలోనే తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా మరో కొత్త కొటేషన్ పంచుకున్నారు వెంకీ మామ.. అందులో భాగంగానే రమణ మహర్షి చెప్పిన వ్యాఖ్యలను కొటేషన్ రూపంలో పంచుకున్నారు.” నిన్ను నువ్వు అర్థం చేసుకోలేనప్పుడు.. సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడంలో ఉపయోగం ఏముంది? అనే అర్థం వచ్చేలా వెంకటేష్ పంచుకున్న ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక ఈ కొటేషన్ అభిమానులలో నిజమే కదా అనే కామెంట్లు వ్యక్తం అయ్యేలా చేస్తోంది. ఏది ఏమైనా సరే మొదట నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి.. అప్పుడే సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే తగిన ఉపయోగం ఉంటుంది అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక వెంకి మామ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని చేసిన ఈ కొటేషన్ అద్భుతంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం.
కొటేషన్ వెనుక ఆంతర్యం ఏమిటి?
వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఆదర్శ కుటుంబం చిత్రంతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి తో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. పైగా వీరిద్దరి కాంబినేషన్ లో ఈయన హీరోగా నటిస్తున్న నాలుగవ చిత్రం కావడం గమనార్హం. అలాగే క్రైమ్ డ్రామా సీరీస్ రానా నాయుడు సీజన్ 2 లో కూడా నటిస్తున్నారు. దీనికి తోడు దృశ్యం 3 సినిమా షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నారు.
మొత్తానికి వెంకటేష్ పంచుకున్న ఈ కొటేషన్ ప్రతి ఒక్కరూ తమను తాము అర్థం చేసుకోవాలని, ఆ తర్వాతే సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని గుర్తు చేస్తుంది. ఇది ఆలోచించదగిన విషయం.

