
📌 Key Points
- వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం’ మూవీ సెట్స్ మీదకు!
- శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ఫిక్స్: KGF బ్యూటీతో వెంకీ మామ రొమాన్స్ అదుర్స్!
- ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకుంటే పొరపాటే: సెకండాఫ్ లో ఊహించని యాక్షన్ సీక్వెన్స్!
- సంక్రాంతి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ మూవీ: త్రివిక్రమ్ డైరెక్షన్లో రికార్డులు బ్రేక్ చేసేందుకు రెడీ!
విక్టరీ వెంకటేష్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ఒక సినిమా చేస్తున్నారంటే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. వీరి కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంపై టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ మూవీ గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వెంకీ, త్రివిక్రమ్ కాంబో: ఈసారి రికార్డులు షేక్ అవ్వాల్సిందే!
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ప్రస్తుతం ఆదర్శ కుటుంబం అనే చిత్రం రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో కేజిఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే వెంకటేష్ హీరోగా రూపొందిన నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకున్నారా? ఐతే ఇది వినండి!
ఈ రెండు చిత్రాలు కూడా భారీ విజయాలను అందుకున్నాయి. దానితో ప్రస్తుతం వీరి కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వెంకటేష్ ఎక్కువ శాతం ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలలో నటించడం, త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇదే జోనర్ పై ఆసక్తి చూపడంతో, ఈ సినిమా టైటిల్ కూడా ఆదర్శ కుటుంబం అని ఉండడంతో చాలామంది ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అని భావిస్తున్నారు. అలా అనుకుంటే వారు పప్పులో కాలేసినట్లే అని తెలుస్తుంది.
శ్రీనిధి శెట్టితో వెంకీ మామ: రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో?
ఈ సినిమా టైటిల్ ఆదర్శ కుటుంబం అయినా కూడా ఇందులో కేవలం ఫస్టాఫ్ వరకు మాత్రమే కుటుంబ సన్నివేశాలు ఉండనున్నట్లు, సెకండ్ హాఫ్ లో కుటుంబ సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా కథ సాగనున్నట్లు, అందులో భారీ ట్విస్టులు, మలుపులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ విజయం తర్వాత వెంకటేష్ నటిస్తున్న సినిమా కావడం, త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తూ ఉండడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


