|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సింగర్‌గా మారిన వెన్నెల కిశోర్‌.. పాటతోనూ నవ్వించేశాడు!

Published: 04-10-2025, 4:06 PM
సింగర్‌గా మారిన వెన్నెల కిశోర్‌.. పాటతోనూ నవ్వించేశాడు!

స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ కొత్త అవతారమెత్తారు. ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాలో సింగర్‌గా మారి ‘అనుకుందొకటిలే..’ అనే పాటను ఆలపించారు. డాక్టర్ భ్రమరం పాత్రలో తన గాత్రంతోనూ నవ్వులు పంచనున్నారు. ఈ పాట ఇప్పటికే ఆకట్టుకుంటోంది.

Key Points

1

స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ 'సంతాన ప్రాప్తిరస్తు' సినిమాతో సింగర్‌గా మారారు.

2

ఆయన 'అనుకుందొకటిలే..' అనే పాటను ఆలపించారు, డాక్టర్ భ్రమరం పాత్రలో నవ్వులు పంచనున్నారు.

4

విక్రాంత్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

వెన్నెల కిషోర్ కొత్త అవతారం: సింగర్‌గా

స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ సింగర్ గా మారారు. ఇన్నాళ్లు తన హావభావాలతో అలరించిన ఈ కమెడియన్‌..ఇకపై తన గాత్రంతోనూ ఆకట్టుకోనున్నాడు. ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాలో  ‘అనుకుందొకటిలే..’అనే పాటను ఆయన ఆలపించాడు. విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో గర్భగుడి వెల్ నెస్ సెంటర్ నిర్వహించే డాక్టర్ భ్రమరం పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వులు పంచనున్నారు. తన దగ్గరకు చికిత్స కోసం వచ్చిన కథానాయకుడికి ధైర్యం చెబుతున్న సందర్భంలో డాక్టర్ భ్రమరం పాత్ర నేపథ్యంగా ‘అనుకుందొకటిలే..’ పాటను ఆకట్టుకునేలా రూపొందించారు.

‘అనుకుందొకటిలే..’ పాట ఎలా ఉందో చూస్తే – అనుకుందొకటిలే, అయ్యిందొకటిలే,అయిపోలేదులే, గేరే మార్చులే,  భ్రమరం ఫార్ములా ఫెయిలే అవదులే, కళ్లే మూసుకో, నన్నే నమ్ముకో.. అంటూ వినోదాత్మకంగా సాగుతుందీ పాట. ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేయగా, బాలవర్థన్ లిరిక్స్ అందించారు. వెన్నెల కిషోర్ ప్రొఫెషనల్ సింగర్ లా పాడి ఆకట్టుకున్నారు. సంజీవ్ రెడ్డి  దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్‌ కానుంది.

‘అనుకుందొకటిలే..’ పాట విశేషాలు

సంతాన ప్రాప్తిరస్తు చిత్ర బృందం

వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్‌తో పాటు గాత్రంతోనూ మెప్పించడం అభినందనీయం. ‘అనుకుందొకటిలే..’ పాట సినిమాపై అంచనాలను పెంచుతోంది. ‘సంతాన ప్రాప్తిరస్తు’ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.