
📌 Key Points
- సెలబ్రిటీల జాతకాల గురించి వేణు స్వామి తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.
- దక్షిణాది హీరో విడాకులు తీసుకుంటారని వేణు స్వామి గతంలో జోస్యం చెప్పారు.
- విజయ్, సంగీత విడాకులు తీసుకోబోతున్న నేపథ్యంలో ఈ వీడియో వైరల్ అయింది.
- తాను చెప్పిన విషయాలు నిజమయ్యాయని వేణు స్వామి స్పష్టం చేశారు.
వేణు స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. కోలీవుడ్ హీరో విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకోబోతున్నారని, ఇదివరకే తాను చెప్పిన జోస్యం నిజమైందని ఆయన అన్నారు. ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
సెలబ్రిటీల గురించి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు
Venu Swamy: వేణు స్వామి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. వేణు స్వామి(Venu Swamy) సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల గురించి వారి జాతకాల గురించి మాట్లాడుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు అయితే ఈయన చెప్పిన విధంగానే సెలబ్రిటీల విషయంలో కొన్ని జరగడంతో వేణు స్వామిని నమ్మే వారి సంఖ్య కూడా అధికమైంది. వేణు స్వామి జాతకాలు నిజం కావడంతో ఈయన తరచూ సినిమా రాజకీయ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలియజేయడంతో వార్తల్లో నిలిచారు .కొన్నిసార్లు ఈయన శృతిమించి మాట్లాడటంతో ఈయనపై కేసులు కూడా నమోదు చేశారు. వేణు స్వామి సెలెబ్రిటీలకు సంబంధించి మంచి కంటే కూడా చెడే ఎక్కువగా చెబుతున్నారని విమర్శలను కూడా ఎదుర్కొన్నారు.
ఇకపోతే వేణు స్వామి చెప్పిన విధంగానే కొన్ని సంఘటనలు మళ్లీ జరగడంతో మరోసారి ఈయన వార్తల్లో నిలిచారు. ఇటీవల కోలీవుడ్ హీరో విజయ్ (Vijay)తన భార్య సంగీత(Sangeetha) విడాకులు (Divorce)తీసుకుని విడిపోబోతున్న సంగతి తెలిసిందే. తన భర్త నుంచి విడాకులు కోరుతూ సంగీత కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే వీరికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. ఇక వేణు స్వామి కూడా గతంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఒక స్టార్ హీరో తన భార్య నుంచి విడాకులు తీసుకుని విడిపోతారని ఒక హీరోయిన్ తో అక్రమ సంబంధం కారణంగానే విడాకులు తీసుకుంటారని మాట్లాడారు.
విజయ్-సంగీత విడాకులపై వేణు స్వామి జోస్యం
వేణు స్వామి ఈ వీడియోలో విజయ్ పేరు ఎక్కడ ప్రస్తావించలేదు కానీ దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన హీరో అంటూ మాట్లాడారు అయితే ఇప్పుడు విజయ్ సంగీత విడాకులకు అప్లై చేయడంతో మరోసారి ఈ వీడియో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ వీడియో వైరల్ గా మారడంతో వేణు స్వామి కూడా స్పందించారు. తాను గతంలో చెప్పిన విధంగానే ఇప్పుడు అన్ని జరుగుతున్నాయని నేను చెప్పిందే జరుగుతోంది అంటూ వేణు స్వామి తెలిపారు. కవిత జైలుకు వెళుతుందని దక్షిణాదికి చెందిన హీరో విడాకులు తీసుకొని విడిపోతారని, అమెరికా యుద్ధం గురించి కూడా ఈయన గతంలో తెలిపారు.
ఇలా ప్రతి ఒక్కటి తాను చెప్పిన విధంగానే జరుగుతున్నాయి. అయితే చాలామంది తనని మంచి కంటే కూడా చెడు ఎక్కువగా చెబుతానని విమర్శిస్తుంటారు కానీ చెడు చెప్పడం వల్ల మానసికంగా మనం వారిని మరింత దృఢపరిచినట్లు అవుతామని అందుకే తాను జరగబోయే మంచి కంటే కూడా చెడు ఎక్కువగా చెబుతూ ఉంటాను అంటూ వేణు స్వామి ఈ సందర్భంగా గతంలో చెప్పిన సంఘటనల గురించి మరొక వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా వేణు స్వామి చెప్పిన విధంగానే ఒక్కొక్కటి మళ్లీ జరుగుతున్న నేపథ్యంలో వేణు స్వామి ట్రెండింగ్ లో ఉన్నారు.
నేను చెప్పిందే నిజమైందంటున్న వేణు స్వామి
సెలబ్రిటీల గురించి తాను చెప్పే విషయాలు చాలామందికి నచ్చకపోయినా, జరగబోయే చెడును ముందే చెబితే మానసికంగా సిద్ధంగా ఉండొచ్చని వేణు స్వామి అంటున్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.


