
📌 Key Points
- హీరో వేణు తొట్టెంపూడి అనన్య శర్మతో రొమాంటిక్ సీన్స్ చేయడానికి నిరాకరించారు.
- ఆమె తన కూతురిలాంటి వయసున్న అమ్మాయి అని వేణు పేర్కొన్నారు.
- వేణు చివరిగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో కనిపించారు.
- అనన్య శర్మ యూట్యూబ్ ద్వారా నటనారంగంలోకి అడుగుపెట్టింది.
హీరో వేణు తొట్టెంపూడి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. హీరోయిన్ అనన్య శర్మతో రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి ఆయన నిరాకరించారు. ఆమె తన కూతురిలాంటి వయసున్న అమ్మాయి అని ఆయన పేర్కొనడం హాట్ టాపిక్‌గా మారింది.
వేణు తొట్టెంపూడి సినీ జీవితం
Venu Thottempudi:ఒకప్పుడు హీరో హీరోయిన్లను ఎంపిక చేసుకోవడమే కాకుండా హీరో హీరోయిన్ మధ్య ఏజ్ గ్యాప్ కూడా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు పాత్ర డిమాండ్ చేస్తే కూతురు వయసున్న హీరోయిన్లతో కూడా రొమాన్స్ చేయడానికి హీరోలు వెనకాడడం లేదు. అలా ఇప్పటికే ఎంతోమంది హీరోలు తమకంటే వయసులో చాలా చిన్న అమ్మాయిలతో రొమాన్స్ చేసి విమర్శల పాలైన వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక హీరో మాత్రం ఆ నటితో రొమాన్స్ చేయడానికి నిరాకరించడమే కాకుండా ఆ అమ్మాయి తనకు కూతురు సమానం అంటూ కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఆయన ఎవరో కాదు వేణు తొట్టెంపూడి.. స్వయంవరం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన వేణు మొదటి సినిమాతోనే నంది స్పెషల్ జ్యూరీ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత చిరునవ్వుతో సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఈయన వీడొక్కడి మొగుడండి?, హనుమాన్ జంక్షన్, ప్రియనేస్తమా, మళ్లీమళ్లీ చూడాలి, కళ్యాణ రాముడు , పెళ్ళాం ఊరెళితే, పెళ్ళాంతో పనేంటి ఇలా ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. చివరిగా దమ్ము సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈయన మళ్లీ 2021లో రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో కం బ్యాక్ ఇచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందించలేదు. ఇక 2023లో అతిధి అనే వెబ్ సిరీస్ లో కనిపించారు ..ఇక మళ్ళీ ఎప్పటిలాగే ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు. అలాంటి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ప్రముఖ నటి అనన్య శర్మతో నటించడంపై ఊహించని కామెంట్లు చేశారు.
అనన్య శర్మతో నటించడానికి వేణు నిరాకరణ
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల వేణు తొట్టెంపూడి హీరోగా ఒక సినిమాలో అనన్య శర్మను హీరోయిన్ గా తీసుకోవాలని చిత్ర బృందం భావించిందట. దీనిపై ఆయన మాట్లాడుతూ..” నా వయసు 49 సంవత్సరాలు. ఆ అమ్మాయి వయసు 22 సంవత్సరాలు. నేను ఆమెతో కలిసి రొమాంటిక్ సన్నివేశాలు ఎలా చేయగలను. ఆమె నాకు కూతురు లాంటిది” అంటూ వేణు తొట్టెంపూడి స్పష్టం చేశారట.. మొత్తానికైతే తన అభిప్రాయాలను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు వేణు తొట్టెంపూడి. ఏది ఏమైనా వేణు తొట్టెంపూడి కామెంట్లు ఇతర హీరోలకు గట్టిగానే తగిలింది అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
అనన్య శర్మ విషయానికి వస్తే యూట్యూబ్ ఛానల్ లో తొలిసారి నటించే అవకాశం రావడంతో నటన వైపు అడుగులు వేసింది. చెన్నైలోని కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే షార్ట్ ఫిలిమ్స్ లో నటించే అవకాశాన్ని అందుకొని తన కెరియర్ను ప్రారంభించింది. చాయ్ బిస్కెట్ , బాయ్స్ ఫార్ములా ఛానల్స్ లోని షార్ట్ ఫిలిమ్స్ తో బాగా పాపులర్ అయింది. ఇక ఆ తర్వాత 30 వెడ్స్ 21 అనే సిరీస్ తో చక్కటి ప్రతిభను కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషలో విడుదలైన లాలీపాప్ అనే కవర్ సాంగ్ తో కూడా అలరించింది.
నెటిజన్ల స్పందన
Tags ananya Venu thottempudi Share
మొత్తానికి వేణు తొట్టెంపూడి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.


