|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విడుదలై తర్వాత వెట్రిమారన్‌ చేస్తున్న సినిమా ఇదే

Published: 29-06-2025, 10:17 PM
విడుదలై తర్వాత వెట్రిమారన్‌ చేస్తున్న సినిమా ఇదే

నటుడు శింబు, దర్శకుడు వెట్రిమారన్ కలిసి చిత్రం చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ‘విడుదలై’ తర్వాత వెట్రిమారన్ చేస్తున్న ఈ సినిమా ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.

Key Points

శింబు-వెట్రిమారన్ కాంబినేషన్

నటుడు శింబు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన ఏ చిత్రంలో నటించినా సంచలనమే అవుతుంది. అదేవిధంగా కోలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన దర్శకుడు వెట్రిమారన్‌. ఈయన చిత్రాలు ఇతర చిత్రాలకు కంటే కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను ఎండగట్టే కథాంశాలే ఈయన చిత్రాలకు కంటెంట్‌ అవుతాయి. ఈయన ఇటీవల తెరకెక్కించిన విడుదలై, విడుదలై 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తదుపరి చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. అలాంటి వారికి సంచలన న్యూస్‌ ఏమిటంటే  నటుడు శింబు హీరోగా చిత్రం చేయబోతున్నారన్నదే. వీరి కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం ఇదే అవుతుంది.

ఉత్తర చెన్నై నేపథ్యం

కాగా ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇది ఇంతకు ముందు వడచెన్నై చిత్రంలో దర్శకుడు అమీర్‌ పోషించిన రాజన్‌ వాగైయరో పాత్రతో కనెక్ట్‌ అయ్యే విధంగా ఉంటుందని సమాచారం. దీంతో ఈ చిత్రానికి రాజన్‌ వాగైయారో అనే టైటిల్‌ నిర్ణయించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్‌ అవుతోంది. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో దర్శకుడు నెల్సన్, నటుడు కవిన్‌ ప్రత్యేక పాత్రల్లో నటించనున్నట్లు, ఆండ్రియా(Andrea Jeremiah) ముఖ్యపాత్రను పోషించనున్నట్లు సమాచారం.

నటీనటుల వివరాలు

చిత్ర షూటింగును వచ్చే వారంలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే సోషల్‌ పొలిటికల్‌ కథాచిత్రంగా ఉంటుందని సమాచారం. కేజీ చిత్రాన్ని కలైపులి ఎస్‌ ధాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీన్ని వెట్రిమారన్‌ చాలా టైట్‌ షెడ్యూల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెలువడే అవకాశం ఉందని సమాచారం.

వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు హీరోగా తెరకెక్కే ఈ చిత్రం సమాజంలోని అన్యాయాలను ప్రతిబింబించే సోషల్ పొలిటికల్ థ్రిల్లర్‌గా ఉంటుందని భావిస్తున్నారు. చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.