|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఈ సినిమాలో యాక్షన్ కంటే డ్రామా ఎక్కువగా ఉంటుంది.. విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published: 15-05-2025, 3:14 AM
ఈ సినిమాలో యాక్షన్ కంటే డ్రామా ఎక్కువగా ఉంటుంది.. విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమా జులై 4న విడుదల కానుంది. తాజా ఇంటర్వ్యూలో విజయ్, ఈ సినిమాలోని యాక్షన్, డ్రామా గురించి, అలాగే అనిరుద్ధ్ సంగీతం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Key Points

1

విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

2

ఈ సినిమాలో యాక్షన్ కంటే డ్రామా ఎక్కువగా ఉంటుందని విజయ్ వెల్లడించారు.

4

ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు విజయ్.

‘కింగ్డమ్’ సినిమా విశేషాలు

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి(Goutham Thinnanoori) దర్శకత్వంలో ‘కింగ్డమ్’(Kingdom) అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే(Bhagya Sri Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సాయి సౌజన్య, సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియోలు, సాంగ్ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచాయి. కాగా ఈ మూవీ మే 30న థియేటర్లలోకి రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడి జులై 4న రిలీజ్ చేయనున్నట్లు రీసెంట్‌గా మూవీటీమ్ వెల్లడించింది.

ప్రస్తుతం విజయ్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అక్కడ ఈ చిత్రం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘కింగ్డమ్ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అదరగొట్టేశాడు. అయితే ఈ మూవీను ఫ్రాంచైజీగా తీసుకు రావట్లేదు.. ముందుగా ఒక కథతో వస్తున్నాం సినిమా హిట్ అయితే సీక్వెల్స్ గురించి ఆలోచిద్దాం అని అనుకున్నాం.. అందుకే కింగ్ డమ్-1 అని టైటిల్ పెట్టలేదు. గౌతమ్ నాకు రెండు కథలు చెప్పాడు.. వాటిలో కింగ్ డమ్ యాక్షన్ డ్రామా కాబట్టి నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో యాక్షన్ కంటే డ్రామా ఎక్కువ ఉంటుంది’ అని విజయ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

విజయ్ దేవరకొండ కామెంట్స్

సినిమా రిలీజ్ డేట్

విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమాపై చేసిన కామెంట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. జులై 4న విడుదల కానున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.