
📌 Key Points
- విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
- ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ఏకంగా ఐదు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.
- దర్శకుడు శౌర్యువ్, సుకుమార్, హరీష్ శంకర్ వంటి స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయనున్నాడు.
- రష్మికతో పెళ్లి తర్వాత విజయ్ కి అదృష్టం కలిసి వచ్చిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. పెళ్లికి ముందు సరైన హిట్టు లేకపోయినా, ఇప్పుడు ఏకంగా ఐదు సినిమాలను లైన్లో పెట్టారు. స్టార్ డైరెక్టర్లతో ఆయన సినిమాలు చేస్తుండటం విశేషం.
పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ జోరు
Vijay Devarakonda : కొంతమందికి జీవితంలో పెళ్లి తర్వాత ఎన్నో అనుకొని అద్భుతాలు ఎదురవుతాయి.. మరి కొంతమందికి పెళ్లి తర్వాత జీవితం శూన్యం అవుతుంది అని చెప్తుంటారు. కానీ సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోల జీవితాలు పెళ్లి తర్వాత లైన్లో పడ్డాయి అన్న విషయం తెలిసిందే.. నాగచైతన్య లాంటి స్టార్ హీరోలు పెళ్లి తర్వాత వరుసగా హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కూడా చేరిపోయాడు. పెళ్లికి ముందు సరైన హిట్ సినిమా కూడా పడని ఈ హీరో ఖాతాలో ఇప్పుడు ఏకంగా ఐదు సినిమాలు లైన్ లో ఉండడం మామూలు విషయం కాదు. ఏ డైరెక్టర్ తో ఆయన సినిమాలు చేయబోతున్నాడో ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తర్వాత జోరుని పెంచేశాడు. ఏకంగా ఐదు భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. స్టార్డైరెక్టర్లతో సూపర్ ట్విస్ట్ స్టోరీలతో సినిమాలతో చెట్ల ముందుకు రాబోతున్నాడు విజయ్ దేవరకొండ.. ‘హాయ్ నాన్న’ సినిమాతో తన ప్రతిభను చాటుకున్న డైరెక్టర్ శౌర్యువ్‌తో ఒక కొత్త సినిమా చేస్తున్నాడు. సుకుమార్‌తో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉంది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కించిన మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో విజయ్ ఓ సినిమా చేయబోతున్నాడు.. ఆల్రెడీ విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉండడంతో మొత్తం ఐదు సినిమాలతో విజయ్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. నిన్న మొన్నటి వరకు ఒక సినిమా మాత్రమే ఏడాదికి ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే విజయ్ ఇప్పుడు ఏకంగా ఐదు సినిమాలకు సైన్ చేయడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. రష్మిక నువ్వు పెళ్లి చేసుకోవడం వల్ల విజయ్ కి అదృష్టం కలిసి వచ్చింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.. మొత్తానికి విజయ్ లైన్ తో అతని ట్రాక్ రికార్డు మారుతుందేమో చూడాలి.
విజయ్ దేవరకొండ లైన్ లో ఉన్న సినిమాలు
విజయ్ దేవరకొండ సక్సెస్ వెనుక రష్మిక కారణమా?
విజయ్ దేవరకొండ గతంలో ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్లోకి వచ్చిన సరే పెద్దగా ఆకట్టుకోలేదు.. దాంతో కథల విషయంలో జాగ్రత్తలు తీసుకున్న విజయ్ రౌడీ జనార్దన్ సినిమాని ప్రకటించాడు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్నారు. మూవీ నుంచి ఇప్పటివరకు బయటకొచ్చిన అప్డేట్స్ అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఇకపోతే రష్మిక మందన్నతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు విజయ్ దేవరకొండ.. వీరిద్దరూ కలిసి నటిస్తున్న మూవీ రణబాలి.. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా. రెండు సినిమాల తర్వాత స్టార్ డైరెక్టర్లతో సినిమాలు ప్రకటించే అవకాశం ఉంది. తనకి విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత తన జోరుని పెంచేశాడు. రష్మికతో చేస్తున్న సినిమా రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.. ఇందులో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకుంటుందో చూడాలి..
మొత్తానికి విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీ అవ్వడం అతని అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో విజయ్ ఎలాంటి విజయాలు సాధిస్తాడో వేచి చూడాలి.


