|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ దేవరకొండ సంచలనం: నాని డైరెక్టర్ తో ఊహించని సినిమా ప్రకటన!

Published: 18-04-2026, 4:05 AM
విజయ్ దేవరకొండ సంచలనం: నాని డైరెక్టర్ తో ఊహించని సినిమా ప్రకటన!
  • నాని డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కొత్త సినిమా.
  • వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది.
  • హసీమ్ అబ్దుల్ వాహబ్ సంగీత దర్శకుడుగా పనిచేయనున్నారు.
  • విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ జనార్ధన, రణబలి చిత్రాల్లో నటిస్తున్నారు.

విజయ్ దేవరకొండ నాని డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో కొత్త సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రం భారీగా నిర్మించబడుతుంది.

నాని డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా

Vijay Deverakonda:రౌడీ హీరో అలియాస్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పెళ్లి తర్వాత మరింత జోరు పెంచారనే చెప్పాలి. ఇప్పటికే రౌడీ జనార్ధన, రణబాలి వంటి చిత్రాల షూటింగ్ లతో బిజీగా ఉన్న ఈయన తాజాగా మరో సినిమాను ప్రకటించారు. నాని (Nani) డైరెక్టర్ తో కొత్త సినిమా ప్రకటించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. అసలు విషయంలోకి వెళ్తే.. నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ (Shouryuv) దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు విజయ్ దేవరకొండ తాజాగా ప్రకటిస్తూ.. తన టీమ్ తో ఒక పోస్టర్ ను కూడా ఆయన విడుదల చేశారు.

నానితో గతంలో హాయ్ నాన్న వంటి లవ్ స్టోరీతో భారీ సక్సెస్ ను అందుకున్న డైరెక్టర్ శౌర్యువ్ – వైరా ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు విజయ్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నారు. హాయ్ నాన్న తర్వాత ఎన్టీఆర్ కోసం శౌర్యువ్ ఒక కథ రాసుకున్నారనే ప్రచారం గతంలో జోరుగా సాగింది. ఈ కథకు జూనియర్ ఎన్టీఆర్ పర్ఫెక్ట్ మ్యాచ్ అని కూడా అనుకున్నారట. అయితే ఎన్టీఆర్ కి ఉన్న వరుస సినిమాల కమిట్మెంట్ వల్ల ఆయనతో సినిమా చేయడం కుదరకపోవడంతోనే .. అదే స్టోరీని విజయ్ కి చెబితే..విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అందుకే ఇప్పుడు ఈ సినిమా పట్టాలెక్కబోతోందని సమాచారం. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ శౌర్యువ్ తో విజయ్ కొత్త సినిమా చేస్తున్నాడు అనేది మాత్రం అధికారికం. ఈ మేరకు విజయ్ దేవరకొండ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా విడుదల చేసిన పోస్టర్లో విజయ్ స్క్వాడ్ డాగ్స్ పట్టుకొని వెళ్తుండగా..వెనుక శౌర్యువ్ తో పాటు యూనిట్ యుద్ధానికి సిద్ధమైనట్లు గొడ్డలి, ఈటెలు, గదలు, బాణాలు పట్టుకొని వెళ్తున్నట్టు పోస్టర్ ను డిజైన్ చేశారు. ఇక తాజాగా విడుదలైన ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ అభిమానులలో అంచనాలు పెంచేస్తోంది.

విజయ్ దేవరకొండ న్యూ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్

ఇకపోతే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా హసీమ్ అబ్దుల్ వాహబ్ పని చేయనున్నారు. ఈయన గతంలో హాయ్ నాన్న, ఖుషి , 8 వసంతాలు, ది గర్ల్ ఫ్రెండ్ వంటి సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. ఇక హాయ్ నాన్న చిత్రాన్ని తెరకెక్కించిన వైరా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇప్పుడు ఈ సినిమాని కూడా నిర్మించనుంది.

విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే రష్మిక మందన్నతో పెళ్లి తర్వాత దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ సినిమా రణబాలి షూటింగ్లో బిజీగా ఉన్నారు. మరోవైపు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్ధన సినిమా కోసం కూడా పనిచేస్తున్నారు. ఇప్పుడు శౌర్యువ్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రకటించారు. ఏది ఏమైనా ఇప్పుడు వరుస సినిమాలను ప్రకటిస్తూ మరింత జోరు పెంచేశారు విజయ్ దేవరకొండ. ఈ కొత్త సినిమాతో ఎలాంటి రికార్డులు తిరగ రాస్తారో చూడాలి.

పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందనున్న చిత్రం

Tags Tollywood 2026 Vijay Deverakonda Share

మొత్తానికి విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉండగా, శౌర్యువ్ దర్శకత్వంలో వస్తున్న ఈ కొత్త సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.