|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఫంకీ ఫెయిల్: విశ్వక్ వద్దు అన్న హీరో ఎవరు? తేజ సజ్జ సంచలన నిర్ణయం వెనుక అసలు కథ!

Published: 16-02-2026, 4:35 AM
ఫంకీ ఫెయిల్: విశ్వక్ వద్దు అన్న హీరో ఎవరు? తేజ సజ్జ సంచలన నిర్ణయం వెనుక అసలు కథ!
  • విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఫంకీ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు.
  • దర్శకుడు అనుదీప్ మొదట ఈ కథను తేజ సజ్జకు చెప్పగా ఆయన తిరస్కరించారు.
  • తేజ సజ్జ రిజెక్ట్ చేశాకే ఈ సినిమా విశ్వక్ సేన్ వద్దకు వెళ్లింది.
  • తేజ సజ్జ మంచి కథలను ఎంచుకుంటూ హిట్స్ కొడుతున్నాడని అభిమానులు అంటున్నారు.

విశ్వక్ సేన్ హీరోగా కె.వి అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఫంకీ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ సినిమా కథను మొదట తేజ సజ్జకు చెప్పగా ఆయన రిజెక్ట్ చేశారు. దాంతో ఈ సినిమా విశ్వక్ సేన్ వద్దకు చేరింది.

ఫంకీ సినిమాకు మిక్స్డ్ టాక్

Funky Film: జాతి రత్నాలు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు కె.వి అనుదీప్ తాజాగా విశ్వక్ సేన్(Vishwak sen) హీరోగా ఫంకీ(Funky film) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 13వ తేదీ విడుదలైనప్పటికీ అనుకున్న స్థాయిలో పెద్దగా ఆదరణ సొంతం చేసుకోలేకపోయింది. ఇలా ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో నిర్మాతకు మరోసారి నష్టాలు తప్పవు అంటూ భావిస్తున్నారు అయితే ఈ సినిమాకు వస్తున్న టాక్ గురించి నాగ వంశి స్పందిస్తూ నేనేమీ సాగర సంగమం సినిమా చేశానని చెప్పలేదు మేము చేసింది కామెడీ సినిమా అంటూ ఈయన తెలియజేశారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ జాతి రత్నాలు స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుని ప్రసారమవుతుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. నిజానికి ఈ సినిమాకి విశ్వక్ మొదటి ఎంపిక కాదు అని తెలుస్తుంది .ముందుగా డైరెక్టర్ అనుదీప్ (Anudeep) ఈ సినిమా కథతో హీరో తేజ సజ్జ (Teja Sajja)ను కలిసారట. ఈ సినిమా కథ విన్న తేజ సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈయన రిజక్ట్ చేయడంతోనే ఈ కథ తిరిగి విశ్వక్ వద్దకు వెళ్లిందని సమాచారం.

తేజ సజ్జ రిజక్షన్ వెనుక అసలు కారణం

ఫంకీ కథ విన్న విశ్వక్ ఈ సినిమాకు కమిట్ అవ్వడం జరిగింది అయితే విడుదలైన తర్వాత అనుకున్న స్థాయిలో ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో తేజా సజ్జ జడ్జిమెంట్ మరోసారి కరెక్ట్ అయింది అంటూ ఈ విషయం తెలిసిన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల కాలంలో తేజ మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంపిక చేసుకుంటూ వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈయన కంటెంట్ పరంగా ఆలోచించి ఫంకీ సినిమాని రిజెక్ట్ చేశారని ఇలా రిజెక్ట్ చేయడం మంచిదే అయింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కొన్నిసార్లు కొన్ని సినిమాలను రిజెక్ట్ చేయడమే హీరోలకు ప్లస్ పాయింట్ అవుతుంది.అలా తేజ సజ్జ ఈ సినిమాని రిజెక్ట్ చేసి సేఫ్ అయ్యారు అని చెప్పాలి.

విశ్వక్ ను నిరాశ పరుస్తున్న సినిమాలు..

విశ్వక్ సేన్ కు నిరాశ కలిగిస్తున్న సినిమాలు

ఇక విశ్వక్ ఇటీవల పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. గత ఏడాది లైలా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచింది. తాజాగా ఫంకీ సినిమా కూడా విశ్వక్ కు హిట్ ఇవ్వలేక పోయిందని చెప్పాలి. ఇక తేజ విషయానికి వస్తే..తేజ సజ్జ బాలనటుడిగా ఎన్నో సినిమాలలో నటించిన ప్రేక్షకులను మెప్పించారు. అనంతరం హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్ అందుకున్న తేజ తాజాగా మిరాయ్ వంటి సినిమాతో మరో సక్సెస్ అందుకున్నారు. ఈ విధంగా కంటెంట్ ఉన్న కథలను ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకుంటున్నారు.

మొత్తానికి తేజ సజ్జ ఫంకీ సినిమాను రిజెక్ట్ చేయడం సరైన నిర్ణయమే అని అభిమానులు భావిస్తున్నారు. విశ్వక్ సేన్ కు ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. రాబోయే సినిమాలతో విశ్వక్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.