
📌 Key Points
- విశ్వక్ సేన్ ఫంకీ మూవీ ఓటీటీలోకి, నెట్ ఫ్లిక్స్ లో మార్చి 13 నుండి స్ట్రీమింగ్!
- సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మాణంలో రూపొందిన ఫంకీ మూవీ.
- థియేటర్లలో ఆశించిన ఫలితం రాబట్టలేకపోయిన ఫంకీ సినిమా.
- అనుదీప్ కేవీ దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఫంకీ మూవీ.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఈ సినిమా, ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది!
నెట్ ఫ్లిక్స్ లో ఫంకీ స్ట్రీమింగ్
Funky OTT: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వాక్ సేన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఫంకీ. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ లో లేటెస్ట్ బ్యూటీ కాయదు లోహర్ హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల తరువాత మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. అనుదీప్ టైపు కామెడీ బాగానే ఉంట్టప్పటికీ కథ, కథనం మాత్రం పేలవంగా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.
ఇందులో భాగాంగానే, ఫంకీ(Funky OTT) సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. ఫంకీ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా అధికారిక ప్రకటన చేసింది. దీంతో, ఫంకీ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక, థియేటర్స్ లో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది.
థియేటర్లలో నిరాశ పరిచిన ఫంకీ
ఓటీటీలో ఫంకీకి ఆదరణ లభిస్తుందా?
ఫంకీ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూసేందుకు సిద్ధంగా ఉండండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


