|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ రష్మిక కాదు! పాత ఫోటోలు వైరల్.. అసలేం జరిగింది?

Published: 19-02-2026, 6:35 AM
షాకింగ్: విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ రష్మిక కాదు! పాత ఫోటోలు వైరల్.. అసలేం జరిగింది?
  • విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
  • విజయ్ దేవరకొండ పాత ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
  • రష్మిక, విజయ్ స్నేహితులు మాత్రమేనని ఇండస్ట్రీలో చాలా మంది భావిస్తున్నారు.
  • విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సమయంలో విజయ్ దేవరకొండకు సంబంధించిన పాత ఫోటో ఒకటి వైరల్ కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయం ఏమిటంటే…

విజయ్, రష్మిక పెళ్లి వార్తల్లో నిజమెంత?

Vijay Rashmika: ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన నటి రష్మిక మందన్న.. హీరో విజయ్ దేవరకొండ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు, వీరీ పెళ్లి బాక్స్ అందులో.. ఇన్విటేషన్ కూడా వైరల్ అవుతున్న తరుణంలో ఇప్పుడు ఒక ఫోటో వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి ఈనెల ఆఖరిలో జరగనుంది. కానీ ఇప్పటివరకు ఈ విషయంపై రష్మిక గానీ, విజయ్ దేవరకొండ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో వీరిద్దరి పెళ్లి పత్రిక కూడా వైరల్ అవుతూ వీళ్ళ పెళ్లి గురించి వాళ్ళు చెప్పకపోయినా.. అభిమానులు మాత్రం పక్క క్లారిటీగా ఉండేలా చేస్తున్నాయి.

ఈ క్రమంలో సోషల్ మీడియా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ పాత ప్రేమ కథను కూడా ఈ ప్రచారంలో లాగుతున్నారు. దశాబ్దం క్రితం ఆయనకు ఓ విదేశీ మోడల్‌తో స్నేహం ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ పాత ఫోటోలు ఇప్పుడు మళ్లీ బయటకు రావడంతో.. పెళ్లి టైంలో ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడమేంది.. ఇదేం కర్మ రా బాబు అంటూ చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.

వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ పాత ఫోటోలు

రష్మిక, విజయ్ ఇద్దరూ మంచి స్నేహితులని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కలిసి సినిమాలు చేయడం, ఈవెంట్స్‌లో కనిపించడం వల్ల వారిపై తరచూ ప్రేమ, పెళ్లి వార్తలు రావడం మొదలయ్యాయి.

అయితే ఈ వార్తలు మాత్రం నిజం చేస్తూ వీళ్లిద్దరూ అని పెళ్లికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం రష్మిక తన సినిమాల పనుల్లో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ కూడా వరుస ప్రాజెక్టులతో ముందుకెళ్తున్నారు. పెళ్లి విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో, అభిమానులు ఓపికగా అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.

అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్న అభిమానులు

మరోపక్క ఒకప్పుడు తన ఫ్రెండ్ తో.. విజయ్ పడుకొని ఉన్న ఫోటో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మాత్రం కొంతమందిని ఆగ్రహానికి గురిచేస్తుంది.

మొత్తానికి విజయ్, రష్మిక పెళ్లి వార్తలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అభిమానులు మాత్రం అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.