
📌 Key Points
- మంచు లక్ష్మి కుమార్తె విద్యా నిర్వాణ ఓణీల వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్.
- విద్యా నిర్వాణ క్యూట్ లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షించారు.
- చిన్న వయసులోనే విద్యా నిర్వాణ చెస్ ట్రైనర్ గా రికార్డులు సాధించారు.
- సరోగసి ద్వారా జన్మించిన విద్యా, మంచు లక్ష్మికి ఏకైక కూతురు.
ప్రముఖ నటి మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ ఓణీల వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విద్యా నిర్వాణ క్యూట్ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
వైరల్ అవుతున్న విద్యా నిర్వాణ ఓణీల వేడుక ఫోటోలు
Manchu Lakshmi: మంచు లక్ష్మి పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ నటుడు మోహన్ బాబు (Mohan Babu) వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం నటిగా కొనసాగుతున్నారు. ఇదివరకు నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించిన మంచు లక్ష్మి(Manchu Lakshmi) ఇటీవల నిర్మాణ వ్యవహారాలను పక్కనపెట్టి కేవలం నటిగా మాత్రమే కొనసాగుతున్నట్టు తెలియజేసారు. ఇటీవల లేచింది మహిళా లోకం అనే సినిమా ద్వారా మంచు లక్ష్మి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈమె వరస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ తన సినిమాలు మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేక పోతున్నాయి.
ప్రస్తుతం పలు సినిమా పనులలో బిజీగా ఉంటున్న మంచు లక్ష్మి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ(Vidya Nirvana) ఓణి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మార్చి 15వ తేదీ తన కుమార్తె ఓణీల వేడుకను మంచు లక్ష్మి ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా మంచు లక్ష్మి కుమార్తె విద్యా నిర్వహణ క్యూట్ లుక్స్ తో ఎంతో చూడముచ్చటగా ఉన్నారు.
చిన్నారి విద్యా నిర్వాణ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మి గాని లేదా మంచు కుటుంబ సభ్యులు గాని ఎక్కడ షేర్ చేయలేదు కానీ ఈ ఫోటోలు బయటకు రావడంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వేడుకలో భాగంగా మంచు కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారా? లేదా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక మంచు లక్ష్మికి విద్యానిర్వాన ఏకైక కూతురనే విషయం అందరికీ తెలిసిందే. ఈ చిన్నారికి మంచు లక్ష్మి సరోగసి ద్వారా జన్మనిచ్చారు.
చిన్న వయసులోనే చెస్ ట్రైనర్ గా విద్య…
సరోగసి ద్వారా జన్మించిన విద్యా నిర్వాణ
ఈ చిన్నారి అసలు పేరు విద్యా నిర్వాణ మంచు ఆనంద్.. విద్య సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబంలో జన్మించినప్పటికీ ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి మాత్రం రాలేదు. మంచు విష్ణు పిల్లలందరూ ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాలలో నటించారు. కానీ విద్యా మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం విద్య విదేశాలలో చదువుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిన్నారి ఇంత చిన్న వయసులోనే చెస్ ట్రైనర్ గా రికార్డులు సాధించారు. ఇక మంచు లక్ష్మి వారసురాలిగా ఈమె కూడా సినిమా ఇండస్ట్రీలోకి వస్తుందా? లేదా?.అనే విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంచు లక్ష్మి కూతురికి సంబంధించిన ఈసారి వేడుక ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు పాప చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ ఓణీల వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. విద్యా భవిష్యత్తులో ఎలాంటి విజయాలు సాధిస్తుందో చూడాలి.


