|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ దేవరకొండ ‘రణబాలి’: గ్లింప్స్ తోనే గూస్ బంప్స్! భారీ అంచనాలు!!

Published: 26-01-2026, 10:35 AM
విజయ్ దేవరకొండ 'రణబాలి': గ్లింప్స్ తోనే గూస్ బంప్స్! భారీ అంచనాలు!!
  • విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు ‘రణబాలి’ టైటిల్ ఖరారు
  • బ్రిటిష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా సినిమా కథ
  • 2026 సెప్టెంబర్‌లో విడుదల కానున్న రణబాలి
  • రష్మిక హీరోయిన్‌గా జయమ్మ పాత్రలో కనిపించనున్నారు

విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘రణబాలి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం బ్రిటిష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా రూపొందుతోంది.

రణబాలి టైటిల్ గ్లింప్స్ విడుదల

Ranabaali Movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ గ్లింప్ విడుదల చేశారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు రణబాలి (Ranabaali)అని టైటిల్ పెట్టబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే తాజాగా టైటిల్ విడుదల చేశారు. ఈ సినిమాకు ‘రణబాలి ‘ అనే టైటిల్ ప్రకటిస్తూ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతుంది.

ఈ వీడియో చూస్తుంటే బ్రిటిష్ కాలం నాటి పరిపాలనలో భారతీయులు ఎదుర్కొన్న ఇబ్బందులను కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ ఇబ్బందుల నుంచి ప్రజలను ఎలా కాపాడారనే నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని ఈ వీడియో చూస్తేనే స్పష్టమవుతుంది. బ్రిటిష్ పాలన బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇందులో విజయ్ దేవరకొండ లుక్ కూడా అమాంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక(Rashmika) జయమ్మ అనే పాత్రలో కనిపించబోతున్నట్టు ఈ వీడియో ద్వారా వెల్లడించారు.

బ్రిటిష్ కాలం నాటి కథాంశం

ప్రస్తుతం ఈ టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు డైరెక్టర్ చెప్పిన విధంగానే ఈ సినిమాతో ఫాన్స్ ఆకలి తీర్చేస్తారని తెలుస్తోంది. కేవలం టైటిల్ గ్లింప్స్ తోనే ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారని చెప్పాలి. ఇక ఈ సినిమాతో విజయ్ దేవరకొండ పక్కాగా బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నారని తెలుస్తుంది . ఇక ఈ సినిమాని 2026 సెప్టెంబర్ లో విడుదల చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు. ఇక ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాతగా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే.

డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా అనంతరం ఈయన విజయ్ దేవరకొండతో రణబాలి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు . చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ సరైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఈ సినిమా ద్వారా హిట్ కొట్టడం గ్యారెంటీ అంటూ అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించబోతున్న నేపథ్యంలో సినిమా పట్ల మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో డియర్ కామ్రేడ్ , గీతా గోవిందం సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాల తర్వాత మరోసారి రణబాలి ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

విజయ్ దేవరకొండ, రష్మిక ఆసక్తికర పాత్రలు

మొత్తానికి విజయ్ దేవరకొండ రణబాలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా 2026 సెప్టెంబర్ లో విడుదల కానుందని సమాచారం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.