
📌 Key Points
- విజయ్, రష్మికల పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
- ఫోటోలో మహేష్ బాబు, అల్లు అర్జున్, సమంత వంటి సెలబ్రిటీలు కూడా ఉన్నారు.
- ఈ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించబడింది.
- విజయ్, రష్మికల పెళ్లి గురించి అధికారిక సమాచారం లేదు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నిజమైన ఫోటోనా? లేక AI సృష్టించినదా? దీని వెనుక ఉన్న అసలు నిజం ఇప్పుడు తెలుసుకుందాం.
విజయ్, రష్మికల పెళ్లి ఫోటో వైరల్
Vijay Devarakonda Rashmika : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న.. కలిసి నటించిన సినిమాల తర్వాత నుంచి.. వాళ్ళిద్దరూ నిజ జీవితంలో కూడా ప్రేమలో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఇద్దరూ కూడా ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
అయినా సర.. అభిమానులు మాత్రం వీళ్ల పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ ఆసక్తిని మరింత పెంచుతూ ఒక ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఫోటోలో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకుంటున్నట్లు కనిపించారు. దీంతో ఒక్కసారిగా నెటిజన్లలో షాక్ మొదలైంది.
ఈ ఫోటోను చూసిన చాలామంది ఇది నిజమేనా?.. వాళ్లు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారా.. అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ ఫోటో అంత రియల్‌గా ఉండటంతో..అది నిజమైన పెళ్లి ఫోటోనే అనిపించింది. అంతేకాదు, ఆ ఫోటోలో విజయ్ దేవరకొండ, రష్మిక వెనక మన తెలుగు సెలబ్రిటీలు కూడా కనిపించారు.
ఫోటోలో సెలబ్రిటీలు.. నిజమెంత?
ముఖ్యంగా మహేష్ బాబు, అల్లు అర్జున్, సమంత లాంటి స్టార్ సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు ఆ ఫోటోలో ఉండటంతో.. చాలామంది ఇది అసలు పెళ్లి ఫోటోనే అని నమ్మేశారు. సోషల్ మీడియాలో ఆ ఫోటో వేగంగా వైరల్ అవ్వడంతో.. విషయం పెద్ద చర్చగా మారింది.
కానీ అసలు నిజం ఏంటంటే… ఆ ఫోటో పూర్తిగా నిజం కాదు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసిన ఒక ఫేక్ ఇమేజ్. ప్రస్తుతం AI టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్లిందో దీనితో మరోసారి రుజువైంది. సెలబ్రిటీల ముఖాలను చాలా సహజంగా కలిపి..అస్సలు నిజమైన ఫోటోలా కనిపించేలా ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఈ ఫోటోలో చిన్నచిన్న డీటెయిల్స్ కూడా చాలా నేచురల్‌గా ఉండటంతో.. చాలామంది ఇది నిజం కాదని గమనించలేకపోయారు. అందుకే ఇది నిజమేనని అనుకున్నారు. తర్వాత ఇది AI ద్వారా తయారైన ఫోటో అని తెలిసినప్పటికీ..సోషల్ మీడియాలో చర్చ మాత్రం ఆగలేదు.
AI టెక్నాలజీతో ఫేక్ ఇమేజ్
ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న విషయానికి వస్తే, ఇప్పటివరకు వీళ్ల పెళ్లి గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఫిబ్రవరిలో పెళ్లి జరుగుతుందన్న వార్తలు కూడా ఇప్పటికి కేవలం ప్రచారంగానే ఉన్నాయి. వాళ్లు స్వయంగా ప్రకటించే వరకు.. ఇలాంటి వార్తలను నిజమని నమ్మకపోవడమే మంచిది. మరో పక్క వీళ్ళిద్దరూ కూడా సినిమాల పరంగా మాత్రం యమ.. బిజీగా ఉన్నారు.
విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం వారిద్దరూ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి పుకార్లను నమ్మడం మంచిది కాదు.


