|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జనార్థన హంగామా: విజయ్ దేవరకొండ సాహసం ఫలిస్తుందా? లేక రిస్క్ లో పడతాడా?

Published: 14-04-2026, 2:05 PM
జనార్థన హంగామా: విజయ్ దేవరకొండ సాహసం ఫలిస్తుందా? లేక రిస్క్ లో పడతాడా?
  • విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్థన’ కోసం ఊర మాస్ అవతారం ఎత్తడంపై సోషల్ మీడియాలో సందేహాలు.
  • షూటింగ్ బ్రేక్స్ వల్ల సినిమా ప్రొడక్షన్ ఖర్చులు పెరిగిపోతున్నాయని ఇండస్ట్రీలో టాక్.
  • దిల్ రాజు రవి కిరణ్ కోలాపై భారీ బడ్జెట్ పెట్టడం రిస్క్ అవుతుందా అని చర్చలు.
  • విడుదలైన గ్లింప్స్ పాత సినిమాల్ని మిక్సీలో వేసినట్టు ఉందని నెటిజన్ల విమర్శలు.

విజయ్ దేవరకొండ నటించిన ‘రౌడీ జనార్థన’ సినిమా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాతో విజయ్ మాస్ హీరోగా నిరూపించుకుంటాడా? ఈ సినిమాపై వస్తున్న విమర్శలు ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

విజయ్ దేవరకొండ ఊర మాస్ గెటప్ వర్కవుట్ అవుతుందా?

Vijay Deverakonda : అర్జున్ రెడ్డి అంటూ ఏ ముహుర్తాన కల్ట్ సినిమా తీసాడో కాని అప్పటి నుండి దాన్ని మ్యాచ్ చేసే సినిమా పట్టలేక తల పట్టేసుకుంటున్నాడు విజయ్ దేవర కొండ. ప్యాన్ ఇండియా రేంజ్ లో సౌండ్ చేస్తుందనుకున్న లైగర్, సక్సెస్ ఇస్తుందనుకున్న కింగ్ డమ్ ఇలా చేసిన ప్రతీ సినిమా బోల్తా కొట్టిందే. దీనితో ఈ రౌడీ హీరో ఆశలన్నీ ఇప్పుడు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో వస్తున్న ‘రౌడీ జనార్థన’, రాహుల్ సంక్రీత్యన్ ‘రణబాలి’ పైనే పెట్టుకున్న పరిస్థితి.

ఊర మాస్ గెటప్.. వర్కవుట్ అవుతుందా?

నిజానికి విజయ్ దేవరకొండ అంటేనే ఒక సాఫ్ట్ లేదా మాస్ బాడీ లాంగ్వేజ్ ఉన్న హీరో. కానీ మొదటిసారిగా ‘రౌడీ జనార్థన’ కోసం ఆయన పూర్తిస్థాయి ఊర మాస్ అవతారం ఎత్తాడు. అయితే 80లకాలం నాటి నేపథ్యం, ఈస్ట్ గోదావరి యాస అంటూ విజయ్ చేస్తున్న ఈ ప్రయోగం వినడానికి బాగానే ఉన్నా, స్క్రీన్ మీద ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ముఖ్యంగా ‘బండెడు అన్నం తిని.. కుండెడు రక్తం తాగే’ రాక్షసుడి లాంటి క్యారెక్టర్ అంటే అది ‘అఖండ’ లాంటి బాలయ్య సినిమాకో లేక ఎన్టీఆర్ కో సెట్ అవుతుంది కానీ, విజయ్ సుకుమారమైన బాడీ లాంగ్వేజ్‌కి అది సెట్ అవుతుందా? అంటూ డౌట్స్ రైజ్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు.

షూటింగ్ బ్రేక్స్, పెళ్లి గోల.. నిర్మాతలకు తలనొప్పి?

షూటింగ్ బ్రేక్స్.. పెళ్లి గోల.. నిర్మాతలకు తలనొప్పి?

ఇక ఈ మధ్యే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం గురించి సోషల్ మీడియాలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఈ ‘పెళ్లి బ్రేక్’ వల్ల సినిమా షూటింగ్‌కు ఆగిపోయిందని దీనివల్ల ప్రొడక్షన్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఇండ సైడ్ టాక్. మరో వైపు రవి కిరణ్ కోలా లాంటి యంగ్ డైరెక్టర్ మీద ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి దిల్ రాజు రిస్క్ చేస్తున్నారా? అన్న డిస్కషన్ ఇండస్ట్రీలో గట్టిగానే నడుస్తుందట. ఇక ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే, పాత సినిమాలని మిక్సీలో వేసి రుబ్బినట్టు ఉందని, అందులో కొత్తదనం ఏ కోశానా లేదని పెదవి విరుస్తున్నారు నెటిజన్లు.

ఇంటర్వెల్ బ్యాంగ్ పేరుతో భారీ వృధా?

ఇక లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, ఈ సినిమా కోసం ఒక భారీ ఇంటర్వెల్ బ్యాంగ్ ప్లాన్ చేశారట మేకర్స్. దీని కోసం కోట్లు ఖర్చు చేసి ప్రత్యేకమైన సెట్ వేయిస్తున్నారట. దీంతో సినిమా కంటెంట్ మీద నమ్మకం లేనప్పుడే ఇలాంటి ‘హెవీ సెట్స్’ మరియు ‘యాక్షన్ సీక్వెన్స్’ లతో కవర్ చేస్తారని ట్రోల్ చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్. 80వ దశకంలో జరిగిన యదార్థ సంఘటన అని చెబుతున్నా, అందులో డ్రామా కంటే హింస ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తుంది.

ఇంటర్వెల్ బ్యాంగ్ పేరుతో భారీ వృధా?

కీర్తి సురేష్ కాంబినేషన్ కలిసొచ్చేనా?

ఇక ఇందులో మహానటి కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోందన్న సంగతి తెల్సిందే. అయితే విజయ్-కీర్తిల కాంబినేషన్ ఆన్-స్క్రీన్ మీద ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే వరుస ప్లాపులతో ఉన్న విజయ్, ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేస్తున్నా అని బిల్డప్ ఇస్తున్నా మాటలు కేవలం పబ్లిసిటీ స్టంట్స్ మాత్రమేనా లేక నిజంగానే మ్యాజిక్ చేస్తారా? అన్నది కాలమే డిసైడ్ చేయాలి.

మొత్తానికి ‘రౌడీ జనార్థన’ సినిమా విజయ్ దేవరకొండకు చాలా కీలకం. ఈ సినిమాతో ఆయన తన సత్తా చాటుకుంటాడా లేదో చూడాలి. ఫలితం కోసం వేచి చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.