|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vijay Devarakonda: 20 ఏళ్ల క్రితం నా రూమ్ ఇదే.. రౌడీ హీరో ఎమోషనల్

Published: 07-10-2025, 11:42 PM
Vijay Devarakonda: 20 ఏళ్ల క్రితం నా రూమ్ ఇదే.. రౌడీ హీరో ఎమోషనల్

హీరో విజయ్ దేవరకొండ తాజాగా పుట్టపర్తిని సందర్శించారు. 20 ఏళ్ల క్రితం తాను చదువుకున్న పాఠశాల, హాస్టల్ గది, మందిరం చూసి భావోద్వేగానికి లోనయ్యారు. రష్మికతో నిశ్చితార్థం తర్వాతే సాయిబాబా దర్శనం చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Key Points

1

హీరో విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి పుట్టపర్తి సాయిబాబా దర్శనం చేసుకున్నారు.

2

తన 20 ఏళ్ల నాటి క్లాస్ రూమ్ (1ఏ), హాస్టల్ గది (బీ-13) జ్ఞాపకాలను వీడియోగా పంచుకున్నారు.

4

పుట్టపర్తి నుంచి తిరిగి వస్తుండగా కారుకు స్వల్ప ప్రమాదం జరిగింది, అయితే ఎవరికీ గాయాలు లేవు.

పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ భావోద్వేగ పర్యటన

హీరో విజయ్ దేవరకొండ రీసెంట్‌గానే రష్మికతో నిశ్చితార్థం చేసుకున్నాడని టాక్. ఇది నిజమే అయినప్పటికీ బయటకు చెప్పకుండా రహస్యంగా ఉంచుతున్నారు. అయితే ఇది జరిగిన వెంటనే విజయ్.. తల్లి, తమ్ముడు ఆనంద్‌తో కలిసి పుట్టపర్తి సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. ఒకటి రెండు ఫొటోలతో ఈ విషయం కూడా బయటపడింది. అయితే ఇప్పుడు ఆ ట్రిప్‌ వీడియోని స్వయంగా విజయ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.

పుట్టపర్తి వెళ్లడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పిన విజయ్ దేవరకొండ.. తను మొదట చేరిన ‘1ఏ’ క్లాస్ రూమ్.. వేదాలు, మంత్రాలు, భజనలు నేర్చుకున్న మందిరం.. గతంలో తనలా ఇప్పుడు ఇక్కడున్న పిల్లలు… నా రూమ్ బీ-13 మధ్యలో కప్ బోర్డ్ నాదే.. మమ్మల్ని సక్రమమైన దారిలో నడిపించిన సార్స్.. అంటూ 20 ఏళ్ల తన జ్ఞాపకాల్ని వీడియో రూపంలో పొందుపరిచి ఇన్ స్టాలో వీడియోగా పోస్ట్ చేశాడు.

గత జ్ఞాపకాలు: క్లాస్ రూమ్, హాస్టల్ గది

విజయ్ దేవరకొండ ముఖంలో పెళ్లికళ ఉట్టిపడుతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత సడన్‌గా పుట్టపర్తి దర్శనం చేసుకోవాల్సిన అవసరం విజయ్ దేవరకొండకు అయితే లేదు. అలాంటిది ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్లాడంటే కచ్చితంగా నిశ్చితార్థం జరిగిన తర్వాత సాయిబాబా ఆశీర్వదాలు తీసుకోవడానికేనని రౌడీ హీరో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

నిశ్చితార్థం వార్తలు: సాయిబాబా ఆశీర్వాదం

అయితే పుట్టపర్తి దర్శనానంతరం.. విజయ్ ప్రయాణిస్తున్న కారు ఓ చోట ప్రమాదానికి గురైంది. అయితే ఈ యాక్సిడెంట్‌లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనా ఇప్పుడు విజయ్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది.

విజయ్ దేవరకొండ తన పాత జ్ఞాపకాలను పంచుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. రౌడీ హీరో నిశ్చితార్థం గురించిన చర్చలు, పుట్టపర్తి పర్యటన విశేషాలు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.