
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల నిశ్చితార్థం వార్తలు టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఊహాగానాల మధ్య విజయ్ పుట్టపర్తిలో భావోద్వేగ పోస్ట్ చేశారు. తన జీవితంలో చాలా కీలకం అయిన వ్యక్తి గురించి చెబుతూ “ఎప్పటికీ ప్రేమిస్తాను” అని ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
Key Points
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల సీక్రెట్ ఎంగేజ్‌మెంట్ వార్తలు.
పుట్టపర్తిలో విజయ్ నిశ్చితార్థం రింగుతో కనిపించి పెళ్లి వార్తలకు బలం చేకూర్చారు.
విజయ్ తన 20 ఏళ్ల పాత జ్ఞాపకాలను, స్కూల్ అనుభవాలను పంచుకుంటూ పోస్ట్ చేశారు.
"ఆమె నా జీవితంలో చాలా కీలకం, ఎప్పటికీ ప్రేమిస్తాను" అంటూ విజయ్ చేసిన పోస్ట్ వైరల్.
విజయ్-రష్మిక నిశ్చితార్థంపై ఊహాగానాలు
టా లీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) అక్టోబర్ 4న రష్మిక మందన్నతో (Rashmika Mandanna)సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యలో ఈ వేడుకను చేసుకున్నట్లు టాక్. గత మూడు రోజుల నుంచి ఎక్కడ చూసినా వీరిద్దరి నిశ్చితార్థం గురించిన వార్తలే దర్శనమిస్తున్నాయి. అయినప్పటీకి వీరిద్దరు మాత్రం ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారు. ఇక ఈ వేడుక తర్వాత విజయ్ పుట్టపర్తికి వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. అక్కడ ఆయన నిశ్చితార్థం రింగుతో కనిపించడంతో.. పెళ్లి వార్తలు ఎక్కువయ్యాయి.
సాయిబాబాను తన కుటుంబంతో కలిసి దర్శనం చేసుకోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలకు బలం చేకూరినట్లు అయింది. ఈక్రమంలో.. తాజాగా, విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. పుట్టపర్తి వెళ్లడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తన మొదట చేరిన 1ఏ క్లాస్ రూమ్, వేదాలు, మంత్రాలు, భజనలు నేర్చుకున్న మందిరం.. గతంలో తనలా ఇప్పుడు అక్కడున్న పిల్లల రూమ్ నా కప్ బోర్డ్.. మమ్మల్ని సక్రమైన దారిలో నడిపించిన సార్స్ అంటూ 20 ఏళ్ల జ్ఞాపకాలను షేర్ చేశాడు.
పుట్టపర్తిలో విజయ్ ఎమోషనల్ పోస్ట్
అలాగే తనకు చదువు చెప్పిన టీచర్‌ను కలుసుకున్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ..‘‘జీవితంలో మనం ఎలా మారుతామో తెలుసుకోవడంలో చాలా మంది వ్యక్తులు, ప్రదేశాలు ఉంటాయి. ఇది నా జీవితంలోనే అతి పెద్ద పాత్ర పోషించిన ప్రదేశం. వీరు నా జీవితంలోనే అతి పెద్ద పాత్ర పోషించిన వ్యక్తులు. ఆమె నా జీవితంలో చాలా కీలకం. ఎప్పటికీ రుణపడి ఉంటాను.. ఎప్పటికీ ప్రేమిస్తాను’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతా పలు రకాలుగా స్పందిస్తున్నారు.
“ఆమె” ఎవరు? విజయ్ ప్రేమ పోస్ట్ వెనుక రహస్యం
A post shared by Vijay Deverakonda (@thedeverakonda)
విజయ్ తన స్కూల్ టీచర్ గురించి చెప్పారా లేక రష్మిక గురించేనా అనేది స్పష్టంగా చెప్పకపోయినా, ఈ పోస్ట్ చాలా ఆసక్తికరంగా మారింది. నిశ్చితార్థం వార్తల నేపథ్యంలో ఈ పోస్ట్ మరింత చర్చనీయాంశంగా మారింది.


