|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vijay Deverakonda: నన్ను ఎవడైనా గెలికితే, రివర్స్ అవుతా

Published: 12-11-2025, 11:12 PM
Vijay Deverakonda: నన్ను ఎవడైనా గెలికితే, రివర్స్ అవుతా

‘ది గర్ల్‌ఫ్రెండ్’ సక్సెస్ మీట్‌లో హీరో విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఎవరైనా గెలికితే తీవ్రంగా స్పందిస్తానని హెచ్చరించారు. అదే సమయంలో, రష్మిక ధైర్యాన్ని, ఆమె కెరీర్ జర్నీని ప్రశంసించారు. వారిద్దరి మధ్య జరిగిన కిస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Key Points

1

‘ది గర్ల్‌ఫ్రెండ్’ సక్సెస్ మీట్‌లో విజయ్ దేవరకొండ హాట్ కామెంట్స్ చేశారు.

2

తనను ఎవరైనా గెలికితే రివర్స్ అవుతానని విజయ్ దేవరకొండ వార్నింగ్ ఇచ్చారు.

4

రష్మికకు విజయ్ ఇచ్చిన కిస్, వారి పెళ్లి వార్తలకు దారి తీసి వైరల్ అయింది.

విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు

‘ది గర్ల్‌ఫ్రెండ్’ సక్సెస్ మీట్ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ హాట్ కామెంట్ చేశారు. ఇండస్ట్రీలో తనను ఎవరైనా గెలికితే, మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు విజయ్ దేవరకొండ. వాళ్లకు రివర్స్ గా తాను వ్యవహరిస్తానని హెచ్చ‌రించారు. అయితే హీరోయిన్ రష్మిక తన లాగా కాదని, చాలా క్యూట్ అంటూ ప్రశంసించారు. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ సక్సెస్ మీట్ నిన్న జ‌రుగ‌గా స్పెషల్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ పాల్గొని మాట్లాడారు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ లాంటి కథలు ఎంచుకోవడం చాలా గొప్ప విషయమని వివరించారు.

రష్మిక జర్నీని చూస్తే చాలా గర్వంగా ఉంటుందన్నారు. నిజ జీవితంలో కూడా ఆమె భూమా దేవినే అంటూ వ్యాఖ్యానించారు. ఎవరెన్ని మాటలు అన్నా కూడా, వాటిని లెక్కచేయదని తెలిపారు. వాటిని ప‌ట్టించుకోకుండా కెరీర్ పైన దృష్టి పెట్టి ముందుకు వెళుతుందని పొగిడారు విజయ్ దేవరకొండ. ఇక ఈవెంట్ ప్రారంభాని కంటే ముందు రష్మికను చూడగానే ఆమె చేతిపై కిస్ పెట్టారు విజయ్ దేవరకొండ. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని, అందుకే విజయ్ కిస్ ఇచ్చి హింట్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. క్లిక్

రష్మికపై విజయ్ ప్రశంసలు, ప్రేమగా కిస్

పెళ్లి వార్తలకు దారితీసిన వైరల్ క్షణం

విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు, రష్మికపై ప్రశంసలు, వైరల్ కిస్ ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచాయి. వారి పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి. ఈ సంఘటనలు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.