
విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమా హిందీలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా హిందీలో ‘సామ్రాజ్యం’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. జులై 31న ఈ సినిమా విడుదల కానుంది.
Key Points
విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ నటించిన 'కింగ్డమ్' హిందీలో 'సామ్రాజ్యం' పేరుతో విడుదల.
జులై 31న 'కింగ్డమ్' సినిమా విడుదల తేదీ.
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై భారీ ఎత్తున నిర్మాణం జరిగింది.
బాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ సక్సెస్ కోసం ఆసక్తికరమైన అంచనాలు.
కింగ్డమ్ సినిమా హిందీ టైటిల్
Kingdom : విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ భోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కింగ్డమ్’. విజయ్ ఒక మంచి హిట్ కొట్టి చాన్నాళ్లు అయిపొయింది. కానీ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ వాయిస్ తో గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేయగా ఆసక్తి నెలకొంది.
కింగ్డమ్ ఏదో కొత్తగా, భారీగా ఉండబోతుందని తెలుస్తుంది. కింగ్డమ్ సినిమా కేవలం హిందీ, తమిళ్, తెలుగులోనే రిలీజ్ కాబోతుంది. ఇటీవల సినిమాలు అన్ని ఒకే టైటిల్ తో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్నాయి. వాటికి ఆయా భాషల్లో అర్ధం తెలియకపోయినా అదే టైటిల్ తో అన్ని భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. కానీ కింగ్డమ్ సినిమా హిందీలో వేరే పేరుతో రిలీజ్ కాబోతుంది.
విడుదల తేదీ మరియు అంచనాలు
విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా హిందీలో ‘సామ్రాజ్య’ అనే టైటిల్ తో రిలీజ్ చేయబోతున్నారు. ఈ టైటిల్ తో పోస్టర్ రిలీజ్ చేసి బాలీవుడ్ లో ప్రమోట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో గతంలో విజయ్ లైగర్ సినిమాతో బాగా దెబ్బ తిన్నాడు. ఇప్పుడు కింగ్డమ్ సినిమాతో అయినా బాలీవుడ్ లో పేరు తెచ్చుకుంటాడా చూడాలి. ఇక కింగ్డమ్ సినిమా జులై 31 రిలీజ్ కాబోతుంది.
బాలీవుడ్ ప్రమోషన్లు
చివరగా, విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమా హిందీలో ‘సామ్రాజ్యం’ గా విడుదల కానున్న విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాలీవుడ్‌లో ఈ సినిమా విజయం సాధిస్తుందో లేదో చూడాలి.


