
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల రిసెప్షన్ హైదరాబాద్‌లో జరిగింది.
- రిసెప్షన్ తర్వాత కొంతకాలం విరామం తీసుకుంటానని విజయ్ తెలిపారు.
- టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
- తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేశారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం తర్వాత హైదరాబాద్‌లో రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రిసెప్షన్ అనంతరం కొంతకాలం విరామం తీసుకుంటానని విజయ్ దేవరకొండ ప్రకటించారు.
హైదరాబాద్‌లో విరోష్ జంట రిసెప్షన్
Hyderabad Reception: దక్షిణాది చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ జంటగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ జంట తమ స్నేహితులు, సినీ ప్రముఖులు రాజకీయ నాయకుల కోసం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో మార్చి 4న ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుక సందర్భంగా విరోష్ జంట్ తమపై ప్రేమ కురిపించిన అభిమానులకు థన్యవాదాలు తెలిపారు. అనంతరం ఈ రిసప్ఫన్ తర్వాత ఎవరికీ కనిపించకుండా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి పోతానని, రెస్ట్ తీసుకుంటానని చెప్పుకొచ్చారు.
Read also- Big Tv Kissik Talks: పేరుకే స్టార్ కిడ్…సొంత ఇల్లు కూడా లేదు.. వరలక్ష్మి ఎమోషనల్ కామెంట్స్!
రిసెప్షన్ తర్వాత విజయ్ దేవరకొండ ప్రకటన
ఈ వేడుకకు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ నుంచి ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. కేవలం సినీ రంగమే కాకుండా, తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇతర రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అభిమానుల్లో ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా, ఈ రిసెప్షన్ వేడుకను కేవలం ‘ఇన్విటేషన్ ఉన్నవారికి మాత్రమే’ పరిమితం చేశారు. పోలీసుల సూచన మేరకు భద్రతా కారణాల వల్ల అతిథుల సంఖ్యను తగ్గించి, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కఠినమైన నిబంధనలు అమలు చేశారు. ఆహ్వాన పత్రం ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించారు.
Read also- Allu Sirish Pre-Wedding: శిరీష్ ప్రీవెడ్డింగ్ వేళ అల్లు అర్జున్ పోస్ట్ వైరల్.. ఏం అన్నారంటే?
సినీ, రాజకీయ ప్రముఖుల సందడి
రిసెప్షన్ వేదిక వద్ద విజయ్ దేవరకొండ తెల్లటి సాంప్రదాయ దుస్తుల్లో మెరవగా, రష్మిక మందన్న ఎరుపు రంగు పట్టుచీర మరియు భారీ బంగారు ఆభరణాలతో ఎంతో అందంగా కనిపించారు. ఈ జంట తమ పెళ్లి ఆనందాన్ని పంచుకుంటూ దేశవ్యాప్తంగా దాదాపు 23 నగరాల్లో స్వీట్లు పంపిణీ చేయడమే కాకుండా, పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. రిసెప్షన్‌కు ముందు విజయ్ రష్మిక తెలుగు మీడియాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజయ్ భావోద్వేగానికి లోనవుతూ, “తెలుగు రాష్ట్రాలకు కొత్త కోడలు వచ్చింది, ఆమెను జాగ్రత్తగా చూసుకోండి” అని కోరారు. రష్మిక కూడా అందరి ఆశీస్సులు తమపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకతో వీరిద్దరి వివాహ వేడుకలు ముగియనున్నాయి. త్వరలోనే ఈ జంట తమ వృత్తిపరమైన పనుల్లో నిమగ్నం కానుంది. వీరిద్దరూ కలిసి నటించిన ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల తర్వాత మళ్లీ సెప్టెంబర్‌లో విడుదల కానున్న ‘రణబలి’ చిత్రంలో కలిసి కనిపించబోతున్నారు.
మొత్తానికి విరోష్ జంట రిసెప్షన్ వేడుక ఎంతో సందడిగా జరిగింది. ఈ వేడుకతో వీరి వివాహ వేడుకలు ముగిశాయి. త్వరలోనే వీరిద్దరూ తమ వృత్తిపరమైన పనుల్లో బిజీ కానున్నారు.


