|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ న్యూస్: విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి లీక్! ఫోన్ నంబర్లు వైరల్, రౌడీ షాక్!

Published: 18-02-2026, 9:35 PM
షాకింగ్ న్యూస్: విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి లీక్! ఫోన్ నంబర్లు వైరల్, రౌడీ షాక్!
  • విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి వార్తల్లో నిజమెంత? వ్యక్తిగత విషయాలు లీక్ కావడంపై ఆగ్రహం!
  • రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో వివాహం, మార్చి 4న హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖులకు రిసెప్షన్.
  • పెళ్లికి ఫోన్లు వాడొద్దని కండీషన్ పెట్టిన జంట; ఫోటోలు, వీడియోలు తీయడంపై నిషేధం!
  • గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో ప్రేమలో మునిగిన ఈ జంట పెళ్లి వార్తలపై అభిమానుల ఆసక్తి.

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్. వీరి పెళ్లికి సంబంధించిన ఒక సంచలన విషయం లీక్ అయింది. దాని గురించి తెలుసుకుందామా!

విజయ్, రష్మిక పెళ్లి ఎక్కడ?

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నాలు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌ లో వీరి వివాహం జరగబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఆల్‌రెడీ ప్రారంభమయ్యాయి. గెస్ట్ లకు ఇన్విటేషన్‌ కార్డ్ లు కూడా పంచుతున్నారు విజయ్‌ దేవరకొండ, రష్మిక. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి పెళ్లి పత్రిక ఇచ్చారు విజయ్‌. అయితే  విజయ్‌ ఇన్విటేషన్‌ కార్డ్ లీక్‌ అయ్యింది.

ఈ నెల 26న ప్రైవేట్‌ ఈవెంట్‌గా మ్యారేజ్‌ చేసుకుంటున్నామని, మార్చి 4న రిసెప్షన్‌ ఉందని, దానికి హాజరు కావాలని ఆ లీక్‌ అయిన ఇన్విటేషన్‌ కార్డ్ లో ఉంది. హైదరాబాద్‌లోనే ఈ రిసెప్షన్‌ నిర్వహిస్తున్నారు. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఇన్విటేషన్‌ కార్డ్ లీక్‌ కావడంతోపాటు పెళ్లి, రిసెప్షన్‌ వివరాలను కూడా లీక్‌ చేశారు కొందరు దుండగులు. ఈవెంట్‌కి సంబంధించిన సమాచారం, ఫోన్‌ నెంబర్లు కూడా వెల్లడించి వైరల్‌ చేస్తున్నారు. ఇది వారికి పెద్ద తలనొప్పిగా మారింది.

గుట్టుగా జరుగుతున్న పెళ్లికి కండీషన్లు!

ఈ నేపథ్యంలో దీనిపై విజయ్‌ దేవరకొండ, రష్మిక టీమ్‌ అసహనం వ్యక్తం చేసింది. పెళ్లి కార్డ్ పై ముద్రించి ఉన్న విజయ్‌, రష్మిక ఫోన్‌ నెంబర్లు, ఆహ్వానితుల ఫోన్‌ నెంబర్లని, అలాగే వ్యక్తిగత సమాచారాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసి వారి ప్రైవసీకి భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వారి టీమ్‌ ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి అనేది వ్యక్తిగత ఈవెంట్‌ అని, దాన్ని అంతే పర్సనల్‌గా ఉంచాలని, ఇలా చేయడం కరెక్ట్ కాదని, వ్యక్తిగత ప్రైవసీకి రెస్పెక్ట్ ఇవ్వాలని, ఇలాంటి పోస్ట్ ల విషయంలో సంయమనం పాటించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. పెళ్లికి సంబంధించిన వివరాలు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయోద్దని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే పెళ్లికి సంబంధించి కూడా వాళ్లు కొన్ని కండీషన్లు పెట్టారట. ఉదయ్‌ పూర్‌లో జరిగే పెళ్లికి కేవలం దగ్గరి బంధువులు, మిత్రులు మాత్రమే హాజరవుతారు. లిమిటెడ్‌ గెస్ట్ లతోనే మ్యారేజ్‌ని చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫోన్‌ల విషయంలో విజయ్‌, రష్మికలు కండీషన్‌ పెట్టారట. పెళ్లి సమయంలో ఫోన్లు వాడొద్దని, ఫోటోలు, వీడియోలు తీయోద్దని చెప్పారట. పెళ్లికి సంబంధించిన సమాచారాన్ని లీక్‌ చేయోద్దని చెప్పినట్టు సమాచారం.

లీక్ అయిన ఫోన్ నెంబర్లు, ప్రైవసీకి భంగం!

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి `గీత గోవిందం`, `డియర్‌ కామ్రేడ్‌` చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇన్నాళ్లు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఇప్పుడు ఎట్టకేలకు మ్యారేజ్‌కి రెడీ అయ్యారు. ప్రస్తుతం విజయ్‌ `రౌడీ జనార్థన్‌`, `రణబాలి` చిత్రాల్లో నటిస్తున్నారు. రష్మిక మందన్నా `మైసా`తోపాటు `రణబాలి` అలాగే హిందీలో రెండు సినిమాలు చేస్తోంది.

విజయ్, రష్మిక పెళ్లి వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మీ అభిప్రాయాలను తెలుసుకోవాలని ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.